డెంగ్యు, మలేరియా పాజిటివ్ వచ్చిన గ్రామాలలో యాంటి లార్వ ఆపరేషన్ పనులు, ఫాగింగ్ స్ప్రే పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య అధికారులకు ఆదేశించారు.

జోగులాంబ గద్వాలజిల్లా

డెంగ్యు, మలేరియా  పాజిటివ్ వచ్చిన గ్రామాలలో యాంటి లార్వ ఆపరేషన్ పనులు, ఫాగింగ్ స్ప్రే పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య అధికారులకు ఆదేశించారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా వైద్య అధికారులు మరియు జిల్లా ఆసుపత్రి సిభంది తో రివ్యు సమావేశం నిర్వహించారు.  సిజినల్ వ్యాదులు చూడడానికి స్టాప్ ఎంత మంది ఉన్నారు, వైద్య సిబంది కి సంబందించిన ప్రతి ఒక్కరి  వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఇంటి దగ్గర కాన్పులు కాకుండగా ప్రభుత్వ ఆసుపత్రి లోనే కాన్పులు అయ్యేలా చూడాలనిఅన్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి కేసును టేకప్ చేయాలనీ,  రక్తహీనత  కలిగి ఉన్న ప్రతి గర్భిణి స్త్రీలను గుర్తించి వారికీ త్వరగా చికిత్సలు అందించేలా చూడాలని, ,  ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము కాటు, కుక్క కాటు టీకాలు అందుబాటులో ఉంచాలన్నారు.  అనుమానిత టిబి లక్షణాలు ఉన్న ప్రతి వ్యక్తికి గళ్ళ పరీక్షలు  నిర్వహించి 100 శాతం లక్ష్యం సాదించాలని అన్నారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి, ల్యాబ్స్,  డయగ్నో స్టిక్ సెంటర్స్, నర్సింగ్ హోమ్స్ , క్లినిక్  బయో మెడికల్ వేష్టేజి రిజిస్ట్రేషన్ చేసుకొని  బయట పదవేయకుండా బయో మెడికల్ యాజమాన్యానికి  అప్పగించాలని అన్నారు. సదరం క్యాంప్స్ నిర్వహించిన రోజే సదరం సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. ఆర్ ఎం పి లు ప్రాథమిక చికిత్సలు మాత్రమే అందించేలా చుడాల్లన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి  రక్త పరీక్షల సాంపిల్స్ టి-హబ్ కి పంపించాలని తెలిపారు.  జిల్లా ఆపత్రి నందు ఐసియు పనులు, ఆక్సీజన్  ప్లాంట్ పనులు త్వరగా పూర్తి చేయాలనీ, వి హెచ్ ఎన్ డి (VHND) ప్రోగ్రాం ను జిల్లా అధికారులు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.  ఏజెన్సీనుండి  గద్వాల్ ఆసుపత్రికి టయప్ అయినవి ఉంటే రిపోర్ట్ పంపించాలి.  రిపేర్స్  ఉన్న సబ్ సెంటర్లు పనులు వారంలో కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్, డాక్టర్. శశికళ, డాక్టర్ కిషోర్ , వైద్య సిబంది  తదితరులుపాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

Share This Post