డ్రాగన్‌ ప్రూట్‌ సాగుపై రైతులను ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలోని కన్నెపల్లి మండలంలో సాగు చేసిన డ్రాగన్‌ప్రూట్‌ పండ్ల తోటను శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి పరిశీలించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక పరిన్ధితుల్లో మాత్రమే పండే ఈ డ్రాగన్‌ పూట్‌ను బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల, చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలో ఒక చోట ప్రయోగాత్మకంగా సాగు చేయడం అభినందనీయమని, ఈ దిశగా మరింత రైతులను ప్రోత్సహిస్తూ ఈ పంట సాగు చేసే విధంగా ఉద్యానవన, వ్యవసాయ, వ్యవసాయ విన్తరణాధికారులు చొరవ తీనుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలో 2 నంవత్సరాల క్రితం జాడి రాజలింగు ప్రారంభించిన డ్రాగన్‌ ప్రూట్స్‌ తోట సాగును ఆయన కుమారులు సాయి తేజ, విశ్వతేజ రెండు ఎకరాల్లో కొనసాగిన్తున్నారు.పంట వచ్చేంత వరకు కష్టపడితే భవివ్యత్తులో మంచి లాభాలు ఉంటాయని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సాగు విస్తీర్దాన్ని పెంచాలని నంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి నుప్రజ, జెడ్‌.పి.టి.సి.లు నత్యనారాయణ, రైతులు పుల్లూరి రాజయ్య:
తదితరులు పాల్గొన్నారు

 

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

 

Share This Post