డ్రా పద్ధతి ద్వారా మద్యం దుకాణాలు లైసెన్స్ దారుల ఎంపిక : రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

పత్రికా ప్రకటన నల్గొండ, నవంబర్ 20

శనివారం జిల్లా కేంద్రంలోని గుండ గోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో జిల్లాకు సంబంధించిన 155 మద్యం దుకాణాలకు డ్రా పద్ధతి ద్వారా మద్యం దుకాణాలు లైసెన్స్ దారుల ఎంపిక కార్యక్రమం రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 155 మద్యం దు కాణాలకు గాను 4079 దరఖాస్తులు రాగా శనివారం గుండ గోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో దరఖాస్తు దారుల సమక్షంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లాటరీ తీసి లైసెన్స్ దారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎక్సైజ్ శాఖ సహాయ కమిషనర్(ఎన్ ఫోర్స్ మెంట్) ఎ. శంభు ప్రసాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై.హిమశ్రీ, ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

——————————- సహాయ సంచాలకులు,సమాచార,పౌర సంబంధాల శాఖ,నల్గొండ జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post