slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

డ్రైవర్ వృత్తిని ఎంచుకునే వారికి… శిక్షణ గమ్యస్థానం గా ఐటిడిఆర్– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ – Information and Public Relations Department, Government of Telangana

డ్రైవర్ వృత్తిని ఎంచుకునే వారికి… శిక్షణ గమ్యస్థానం గా ఐటిడిఆర్– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్

డ్రైవర్ వృత్తిని ఎంచుకునే వారికి…
శిక్షణ గమ్యస్థానం గా ఐటిడిఆర్

– మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవ అశోక్ లే ల్యాండ్ సహకారంతో ఏర్పాటు

– పెద్ద నగరాల్లో ఉండే ఇలాంటి సంస్థ
మండేపల్లి లో ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం

– జిల్లా సహా ఔత్సహిక తెలంగాణ యువత సద్వినియోగం చేసుకోవాలి

– కొత్త గా డ్రైవింగ్ నేర్చుకునే వారికే కాకుండా ఇప్పటికే డ్రైవింగ్ వృత్తి లో ఉన్న
వారికి స్వల్ప కాలిక శిక్షణ కోర్స్ లు పెట్టాలి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్

——————————-

డ్రైవింగ్ కూడా పఠనం లాంటిదేనని… వాహన చోదక రంగంలో అన్ని అంశాలను ఆమూలాగ్రం నేర్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి శ్రీ తారక రామారావు ప్రత్యేక చొరవతో అశోక్ లేలాండ్ సంస్థ సహకారంతో తెలంగాణలో మొట్టమొదటి ఐటిడిఆర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సంస్థ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున తెలంగాణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిపుణులైన డ్రైవర్లుగా సేవలందించాలని కోరారు.

ఆదివారం తంగళ్ళపల్లి మండలం మండేపల్లి లోని ఏర్పాటు చేసిన ఐటిడిఆర్ సంస్థ నిర్వహణ తీరు, సంస్థ ను మరింత అభివృద్ధి , ఆదరణ ను పెంపొందించేoదుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ itdr కు వచ్చారు. సంస్థలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2019 సంవత్సరం కంటే ముందు తాను కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు మంత్రి కే టి ఆర్ , తాను తెలంగాణలో ఐటీడీఆర్ లాంటి సంస్థ ఉండాలని భావించామని అన్నారు .
రాష్ట్ర మంత్రి శ్రీ కె తారక రామారావు అశోక్ లేలాండ్ సంస్థ తో మాట్లాడి విశాలమైన స్థలంలో అన్ని సదుపాయాలతో ఐటిడిఆర్ ఏర్పాటు చేశారన్నారు . గత సంవత్సరం జూన్ లో ఈ సంస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని తెలిపారు.
దీని ప్రధాన ఉద్దేశం వాహన చోదకులకు నిపుణులచే అత్యుత్తమ శిక్షను అందించడం తద్వారా ప్రమాదాలను నివారించడం అని తెలిపారు.
దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని తెలిపారు. దాదాపుగా 5 లక్షల మంది ప్రమాదాల బారిన పడి వైకల్యం బారిన పడుతున్నారని తెలిపారు. దీనిని నివారించాలంటే నిపుణులైన డ్రైవర్ల ను తీర్చిదిద్దడమొక్కటే పరిష్కారం అని పేర్కొన్నారు . స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది అన్నారు. తొలి రోజుల్లో డ్రైవర్లకు శిక్షణ ఉండేది కాదన్నారు. స్వీయ ప్రయత్నంతో డ్రైవింగ్ నేర్చుకొని పెద్ద వాహనాలను కూడా నడిపేస్థాయి కి ఎదిగే వారని తెలిపారు.
కాలక్రమంలో డ్రైవర్లకు శిక్షణ ప్రాధాన్యతను గుర్తించిన సింగరేణి ,ఆర్టీసీ వంటి సంస్థలు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేపిస్తున్నాయని తెలిపారు. ఐటీడీఆర్ లో కూడా సింగరేణి సంస్థ సౌజన్యంతో డ్రైవర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దీనితోపాటు ఇదివరకే డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి కూడా….
వైద్యులకు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ మాదిరి డ్రైవర్ లకు నిపుణులచే శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
మూడు రోజులు.. రెండు రాత్రుల ( 3 days, two nights ) స్వల్పకాలిక శిక్షణ నిర్వహిస్తే డ్రైవర్లకు వృత్తి నైపుణ్యాలు మరింత పెంపొందించేందుకు, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలవుతుందన్నారు. డ్రైవింగ్ లో డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులు కూడా పెట్టాలని డ్రైవర్ల నుంచి డిమాండ్ వస్తున్న దృష్ట్యా ఆ ఆలోచన చేయాలని ఐటీ డి ఆర్ బాధ్యులను సూచించారు. తాను కూడా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కొండల్ రావు , ఐటిడిఆర్ బాధ్యులు నుజుమ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
——————————

 

Share This Post