ప్రచురణార్థం
తడిచిన ఇళ్ళల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి…
మహబూబాబాద్ సెప్టెంబర్ 7.
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో ఇండ్ల చుట్టూ వరద చేరి గోడలు నాని పోయి కూలిపోయే ప్రమాదం ఉన్నందున ఆయా ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి భారీ వర్షాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొర్రూరు లో 5 ఇండ్లు కేసముద్రం మండలం లో 3 ఇండ్లు లో ఉన్న వారిని పునరావాస కేంద్రానికి తరలించినట్టు కలెక్టర్ తెలియజేశారు.
కురవి మండలం లో సిరోలు వద్ద కెనాల్ తెగినందున సరి చేయడం జరిగినదన్నారు.
దంతాలపల్లి మండలం పెద్దముప్పారం వద్ద పాలేరు నీరు కురవి మండలం తాళ్ళ సంకీస వద్ద లో లెవెల్ కాజ్వే తాళ్ళచెరువు నీటితోను, నేరడ జంగిల్ గొండ మధ్య వాగు, కేసముద్రం నుండి గూడూరు వెళ్లే దారిలో అప్పనపల్లి వద్ద, గూడూరు నుండి నెక్కొండ రోడ్డులో పాకాల నీరు , కొత్తగూడ మండలం లో పెగడపల్లి నీలంపేట బండ్ ల లీకేజీ, గార్ల నుండి రామపురం వెళ్లే రహదారి, చిన్న గూడూరు మండలం గుండం రాజు పల్లి, గుర్తురు నుండి సోమారం వెళ్లే బ్రిడ్జి మహబూబాబాద్ రూరల్ మండలం mudupugal గ్రామ పరిధిలోని అయోధ్యలలో సమస్యలు గుర్తించినట్లు తెలియజేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని తడిసిన ఇళ్ళల్లో ప్రజలను ఉండనీ రాదని తక్షణం ఖాళీ చేయించాలన్నారు అదేవిధంగా నీటి నిల్వను కూడా మోటార్లతో తొలగింప చేయాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు ఇంజనీరింగ్ అధికారులు వర్షాలు తగ్గగానే రహదారుల మరమ్మతులను తక్షణం చేపట్టేందుకు నివేదిక రూపొందించి పనులను చేపట్టేందుకు మంజూరు పొందాలన్నారు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కంట్రోల్ కేంద్రాలకు వివరాలు అందజేయాలన్నారు.
గ్రామాలలో పంచాయతీ అధికారులు మున్సిపాలిటీలలో మున్సిపల్ సిబ్బంది 24 గంటలు పర్యవేక్షణ చేయాలన్నారు.
ప్రజలు వరద నీటిలో కి వెళ్ళకుండా బారికెడ్స్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ పోలీసు నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
———————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారిచేయనైనది