తనిఖీల పేరుతో రైతులను , మిల్లర్లను ఎఫ్ సి ఐ ఇబ్బంది పెట్టొద్దు

తనిఖీల పేరుతో రైతులను , మిల్లర్లను ఎఫ్ సి ఐ ఇబ్బంది పెట్టొద్దు

రైతు పండించిన ప్రతీ గింజను కనీస మద్దుతు ధరతో రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది

గన్నీల కొరత లేదు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం లేదు

రాష్ట్ర వ్యాప్తంగా 3381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, అందుబాటులో 7కోట్ల 67 లక్షల గన్నీలు

రైతుబందు, కాళేశ్వర నీళ్లు, ఉచిత కరెంటు, ఎరువుల అందుబాటుతో రైతులకు అండగా కేసీఆర్ సర్కార్

రైతులకు సత్వరమే డబ్బులు అందించాలంటే మిల్లులకు ధాన్యం చేరాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

000000

తనిఖీల పేరుతో రైతులను , మిల్లర్లను ఎఫ్ సి ఐ ఇబ్బంది పెట్టొద్దుని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     మంగళవారం కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి ,అసిఫ్ నగర్ ,నాగుల మాల్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి పంటలు పండటం లేదని, కరెంటు, నీళ్లు, మౌళిక వసతులు లేవని, ఇవన్నీ సమకూర్చే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివారు అక్కడ లేరనే అక్కసుతో కండ్లమంటతో మన రాష్ట్రానికి చెందని పార్టీలు పస లేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఈ పార్టీల మాదిరే కొన్ని ప్రసార మాద్యమాలు సైతం కొనుగోలు లేటయిందని, గన్నీలు ఉన్నాయా అని రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఇది సరికాదన్నారు మంత్రి. కొనుగోలు కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరైతు ఇబ్బందులు పడుతున్నామనే పిర్యాదులు రాకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. రైతు కోతలు చేసి కొనుగోలు కేంద్రానికి ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీతో తీసుకురావాలని ఒక్క కిలో కూడా తరుగు పెట్టమన్నారు, గన్నీల లభ్యతపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి తిప్పికొట్టారు, ఈ యాసంగిలో అవసరమైన గన్నీబ్యాగులు 15కోట్లుగా అంచనా వేసామని ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే నాటికే మన వద్ద మొత్తం 1కోటి 62 లక్షల 70వేల 611 గన్నీ బ్యాగులున్నాయని, మే 1 నాటికి 4కోట్లు సేకరిస్తామని చెప్పామని కానీ నిన్నటి వరకూ 7కోట్ల 67లక్షల గన్నీ బ్యాగులను సిద్దం చేసుకున్నాం. గన్నీ బ్యాగుల కొరత లేనే లేదన్నారు. ఎక్కడ తక్కువ ఉన్నా మా దృష్టికి తెస్తే తక్షణం పంపిస్తామన్నారు.
కేంద్రం మోకాలడ్డిన పరిస్థితుల్లోనూ ఆర్థిక భారాన్ని భరించి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం విధితమే. అయితే రాష్ట్రంలో కొంటున్న ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు చేర్చి ఓపిఎంఎస్ లో గుర్తించాలని అప్పుడే రైతులకు త్వరితంగా నిధుల్ని బదిలీ చేసే అవకాశం ఉంటుందని కానీ ఇదే సమయంలో ఎఫ్.సి.ఐ పిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతుందని తద్వారా రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించే ప్రక్రియ నిలిపివేయాల్సి వస్తుందని ఫిజికల్ వెరిఫికేషన్ కు ఇది సరైన సమయం కానందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని రైతులకు సత్వర సేవలు అందేలా చూడాల్సిన బాధ్యతలు తీసుకోవాలన్నారు. సరైన సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయడమే కాకుండా ఎలాంటి అక్రమాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6812 కొనుగోలు కేంద్రాల అంచనా వేసామని అందులో 3381 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కోతల సరళితో కొనుగోల్లు జరుపుతున్నామని 49875 మంది రైతుల నుండి 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని ఇందులో 3.54 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని వీటి విలువ 742 కోట్లు అన్నారు. మిల్లర్లు అక్నాలెడ్జ్ చేసిన వెనువెంటనే రెండు రోజుల్లో డబ్బులు రైతుల అకౌంట్లలో వేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అరకొర పంటలు పండేవని కానీ నేడు భూమికి భరువయ్యేంత పంట పండుతుందన్నారు, దీంతో రైతులు, రాష్ట్రం సంతోషంగా ఉందన్నారు, కరీంనగర్ జిల్లాలో కొనుగోలు వివరాల్ని వెల్లడించారు మంత్రి గంగుల. 249 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని 1373 మంది రైతుల నుండి 8600 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు.

     గతంలో నీళ్లకోసం, కరెంటు కోసం ఉద్యమాలు చేసామని అలా చేసిన ఉద్యమాల్లో తన కాలు సైతం విరిగిన సంగతిని గుర్తుచేసారు మంత్రి గంగుల. కేంద్రం విదానంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్య దళారులకు వెయ్యి రూపాయలకు అమ్ముకునే దుస్థితి నెలకొనేదని కానీ నేడు కేసీఆర్ గారు ఆర్థిక భారాన్ని మోస్తూ కనీస మద్దతు దర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు వీటితో పాటు నీటిపన్ను తొలగించారు, కరెంటు ఉచితంగా ఇస్తున్నారు, రైతుకు మద్దతు అందజేయడానికి రైతు బందు, బీమా ఇస్తున్నారు. మండుటెండల్లో మత్తళ్లు దుంకుతున్నాయని, భూగర్బ జలాలు పెరిగాయని, పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని. రైతుకు అందివ్వాల్సిన మౌళిక వసతుల్ని కేసీఆర్ గారు అందించారని, ఈ పరిస్తితుల్లో ఎకరాకు 20 క్వింటాళ్లనుండి 30 క్వింటాల్లకు దిగుబడులు పెరిగాయని, రైతు దర్నాలు లేవన్నారు. ఐతే రైతులు పండించిన పంటను కొనాల్సిన బాధ్యతనుండి తప్పుకుంది కేంద్రమే అన్నారు. రైతులు వీటన్నింటిని ధ్రుష్టిలో ఉంచుకుంటున్నారని,1960 కనీస మద్దతు దరకే అమ్ముకోవాలని రైతులకు సూచించారు మంత్రి గంగుల కమలాకర్.

   ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share This Post