తన కవిత్వాలు, పాటల ద్వారా తెలంగాణకే కాకుండా యావత్ తెలుగుజాతికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు …… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తన కవిత్వాలు, పాటల ద్వారా తెలంగాణకే కాకుండా యావత్  తెలుగుజాతికి  గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు …… జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, జూలై -22:

తన కవిత్వాలు,పాటలతోటి తెలంగాణకే కాకుండా యావత్ తెలుగుజాతికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

శుక్రవారం కలక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక దాశరథి కృష్ణమాచార్యులు జయంతి కార్యక్రమం నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన ప్రాంత బిడ్డ, ఎన్నో సంవత్సరాలు తన కవిత్వాలు, పాటలతోటి, తెలంగాణకే కాకుండా యావత్ తెలుగుజాతికి కూడా గౌరవం తీసుకొని వచ్చిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు అని కొనియాడారు. అణచివేతకు ఎదురెంచి జైలుపాలు అయి కూడా తన కవిత్వాన్ని, గళాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి అని, మన ప్రాంతం చిన గూడూరులో పుట్టి పెరిగిన వ్యక్తి అని, ఆయన చేసిన రచనలకు చాలా అవార్డులు వచ్చాయి అని, అందులో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు కూడా వారిని వరించిందని, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఆస్థాన కవిగా ఉన్నారని, వారి చరిత్రను మనం మన భావి తరాలకు తెలియ జేయాలని, తెలంగాణ సాయుధ పోరాటానికి ఎంతో ప్రేరణ ఇచ్చారు అని, తాండాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్త్రుతంగా పర్యటించి ప్రజలను తన మాటల ద్వారా, కవిత్వాల ద్వారా, పాటల ద్వారా ఉత్తేజపరిచారని తెలిపారు.

చాలా సందర్భంలో వారు సినిమాలకు రాసిన పాటలను కూడా వింటున్నామని, మన సమావేశ మందిరంలో వారి గుర్తింపుగా పెద్ద చిత్ర పటాన్ని గతంలోనే ఏర్పరుచుకున్నామని, మన భాషాభిమానానికి కృషి చేసిన వ్యక్తిని గుర్తించాలని, భాషాభిమానం అలవర్చుకోవాలని, వారి గుర్తింపుగా ఈ రోజు సాంస్కృతిక శాఖ ద్వారా దాశరథి అవార్డూ ప్రధానం చేయబోతున్నారని తెలిపారు. సమాజంలో జరుగుతున్న మార్పులకు, జరగాల్సిన మంచిని మొదటగా గుర్తించేది, మొదటగా గళమెత్తేది, మొదటగా ప్రపంచ దృష్టికి తిసుకొచ్చేది రచయితలు, కవులు, కళాకారులు అని తెలిపారు. అంత గొప్ప వ్యక్తి మన ప్రాంతం నుండి రావటాన్ని అదృష్టంగా భావిస్తు వారు చేసిన రచనలను, వారు చేసిన పనిని స్మరించుకొని, తర్వాత తరాలకు వారి గురించి తెలపాలని తెలిపారు.

జయంతి చేయడంలో ఉద్దేశ్యం వారిని ఒకసారి తలచుకొని, మనం వారు చూపిన బాటలొ ఆ స్ఫూర్తి పొందాలనేది ఉద్దేశ్యమని, నిస్వార్ధంగా అన్ని సంవత్సరాలు సమాజం కోసం కష్టపడడం జరిగిందని, మనం ఆయన రాసిన అన్ని రచనలు చదవకపోవచ్చు, కాని ప్రయత్నం మనమందరం చేయాలి అని, మనం ప్రయత్నిస్తూ, మన పిల్లలకు, చుట్టు ప్రక్కల వారికి తెలపాలని అన్నారు. వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన కవి అని తెలిపారు. మన ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తి, జాతీయ స్థాయిలో పేరు ఉన్న కవిని మనం స్మరించుకోవలసిన బాద్యత మనమందరి మీద ఉన్నదని, ఇంత గొప్ప స్ఫూర్తి ప్రధాతలు ప్రతి చోట ఉండరని, నిజామాబాద్ జైలులో పెట్టిన సందర్భంలో బొగ్గుతోటి ఆయన రాసిన మాట నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఈ రోజు చెప్పుకుంటున్న మాట, ఆయన రాసిన స్థితిని అర్ధం చేసుకోవాలని, అప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని, విచ్చేసిన అందరికి వారి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, వారి వారసత్వాన్ని, వారి గొప్పతనాన్ని నలుగురికి చెప్పే బాద్యత మన అందరిపైనా ఉందని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎం. డేవిడ్, అడిషనల్ ఎస్పి యోగేష్ గౌతం, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎ.ఒ. వెంకట రమణ, కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post