తప్పులు లేని ఓటర్ జాబితాను తయారు చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితా తయారుచేయాలని, 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ గా నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున నేరడిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులకు, సూపర్ వైజర్ లకు ఓటర్ జాబితా తయారుచేయడం, 18 సంవత్సరాల వయస్సు నిండిన వారి పేర్లను ఓటర్ గా నమోదు చేయడం వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య వంతమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. అర్హత గల వారి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయాలనీ, ఓటర్ జాబితాలో ఉన్న తప్పులను సవరించాలని, మరణించిన వారి, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు సంబందించిన నిర్ణిత ఫారాలను సంబంధిత వారి నుండి సేకరించి రూపొందించాలని తెలిపారు. ఓటర్ జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా రూపొందిస్తామని కంకణబద్దులు కావాలని బూత్ స్థాయి అధికారులకు హితోవు పలికారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని జనాభా, ఓటర్ల సంఖ్య, మహిళలు, పురుషుల ఓటర్లు, దివ్యంగుల ఓటర్ల వివరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలని అన్నారు. జిల్లాలోని అన్ని బూత్ స్థాయి పరిధి లలో బూత్ స్థాయి అధికారులు నిర్వహించే రిజిస్టర్లు ఒకే విధంగా, ఒకే పద్దతిలో నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నుండి వచ్చే ఓటర్ జాబితా పరిశీలకులు అడిగే అన్ని వివరాలకు పూర్తీ సమాచారం బూత్ స్థాయి అధికారులకు తెలిసి ఉండాలని అన్నారు. నేరడిగొండ మండలంను అన్ని అంశాలలో మొదటి స్థానంలో నిలిచే విధంగా బూత్ స్థాయి అధికారులు కృషి చేయాలనీ కోరారు. మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నాణ్యతతో కూడిన ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి అవసరమైన శిక్షణలు బూత్ స్థాయి అధికారులకు మండలాల వారీగా ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమిష్టి కృషితో జాబితాను సిద్ధం చేయాలనీ అన్నారు. 18 ఏళ్ళు నిండిన వారందర్ని తప్పనిసరిగా ఓటర్ జాబితాలో పేర్లను నమోదు చేయాలనీ అన్నారు. ఆయా బూత్ స్థాయి అధికారులు వారి పరిధి లోని ప్రతి ఇంట్లోని ఓటర్ల సంఖ్య, ఇంటి నెంబర్, వయస్సు, లింగం, తదితర వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలనీ అన్నారు. గురువారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యూత్ ఓటర్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని ఇట్టి కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. అనంతరం గరుడ యాప్ గురించి బూత్ స్థాయి అధికారులకు మాస్టర్ ట్రైనర్ వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ అబ్దుల్ సమద్, ఎంపీపీ రాథోడ్ సదన్, బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post