తమ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని కృతనిశ్చయంతో పనిచేసినందుకే నేడు జాతీయ స్థాయి అవార్డులు అందుకుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ అన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి సమీపాన స్కిల్ డౌలాప్ మెంట్ సెంటర్ లో జరిగిన జాతీయ పంచాయతీ అవార్డులు-2022 ప్రదానోత్సవానికి జడ్పి చైర్మన్ తో పాటు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి ముఖ్య అతితులుగా పాల్గొన్నారు. 9 కేటగిరీల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బందికి అవార్డులు మెమోంటోలు ప్రధానం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని రానున్న రోజుల్లో కొనసాగించి అన్ని అంశాల్లో గ్రామాన్ని ఉత్తమంగా నిలిపేవిధంగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయని ఆ సమస్యలను అధిగమించి వివిధ థీమ్ లలో కష్టపడి తమ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన గ్రామ పంచాయతీ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ జాతీయ దీన్ దాయాల్ గ్రామ పంచాయతీ అవార్డులను ( 9) కేటగిలు గా విభజించి ప్రతి కేటగిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి మూడు గ్రామ పంచాయతీలకు మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు కేటాయించి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ తిమ్మిది కెటగిరిల్లో 1. ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్ములన 2. ఆరోగ్యకర గ్రామపంచాయతీ, 3. పిల్లల ఆరోగ్యం స్నేహపూర్వకత 4. తాగునీటి ఇబ్బందులు లేకుండా సరిపడా తాగునీరు 5. శుభ్రత మరియు ఆకుపచ్చ, (క్లిన్ అండ్ గ్రీన్) 6. మౌళిక సదుపాయల్లో స్వయం సమృద్ధి 7. సామాజిక భద్రత 8. సుపరిపాలన 9. మహిళా స్నేహపూర్వకత సాధికారత వంటి 9 థీమ్ లను ఎంచుకొని 2030 నాటికి వీటిని వంద శాతం సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 2022 సంవత్సరానికి గాను ఈ 9 థీమ్ లలో బాగా కృషి చేసిన గ్రామ పంచాయతీల సర్పంచులు పంచాయతి సెక్రెటరీ, సిబ్బందికి సన్మానం చేసుకోవడం జరిగింది. గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై కేంద్రప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వివరాలు పంపించగా. ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రామ పంచాయతీలకు పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పేరిట పురస్కారాలు, ప్రశంసాపత్రాలను అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని పదకొండు మండలాల్లోని గ్రామ పంచాయతీలు థీమ్ ల వారిగా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు అంటే మొత్తం 27 గ్రామపంచాయతీలకు జాతీయ స్థాయి అవార్డులు వరించినవి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు, పంచాయతి సెక్రటరిలు, సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తే ఈ జాతీయ అవార్డులు సాధించారని కొనియాడారు. ఒకప్పుడు సర్పంచులు ఏ పని లేకుండా ఉండేదని ఏ పని జరగాలన్న శాసన సభ్యులకు వచ్చి అడిగేది అన్నారు. నేడు సర్పంచులు రాజులు అయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులు నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లలో జమ ఆవుతున్నాయని , గ్రామ సభ నిర్వహించుకొని అభివృద్ధి పనులు వారే చేసుకుంటున్నారన్నారు. నేడు సర్పంచులకు సమాజంలో నిజమైన గౌరవం దక్కుతుందన్నారు. ఈ సారి అవార్డులు రానివారు నిరాశపడవద్దని వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత పట్టుదలతో కృషి చేసి వచ్చే సంవత్సరం ఎక్కువ అవార్డులు సాధించాలని సూచించారు. కోస్గి మండలంలో మొత్తం 8 జాతీయ అవార్డులు సాధించినందుకు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో
జడ్పి వైస్ చైర్మన్ సూరేఖ , జడ్పి సి.ఈ.ఓ జ్యోతి, పి.డి డి.ఆర్.డి.ఓ గోపాల్, డి.పిఓ మురళి, ఎంపిపి లు, జడ్పిటిసిలు, సర్పంచులు, పంచాయతి సెక్రెటరీలు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.