తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ కి వచ్చే ప్రతీ అర్జీదారుడు సంతోషంగా తిరిగి వెళ్లేలా ప్రతీ ఉద్యోగి పని చేయాలన్న – కలెక్టర్ గోపి

గురువారం కలెక్టరేట్లో గల అన్నీ సెక్షన్ల సిబ్బందితో కలెక్టర్ సమావేశమయ్యారు .

ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత గడువు లో ప్రతీ ఫైల్ క్లియర్ కావాలన్నారు.

ఎవరెవరు ఏ సెక్షన్ చూస్తున్నారు….వారి జాబ్ చార్ట్ ఏంటి అని ప్రతీ ఉద్యోగిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఎవరి దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి… ఎన్ని క్లియర్ చేశారు … ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి.. అవి ఎవరి దగ్గర ఉన్నాయి…. తదితర వివరాలన్నీ ప్రతీ సెక్షన్ వారు వీలైనంత త్వరగా ఇవ్వాలన్నారు .

తమ సమస్య లకు పరిష్కారం కావాలని ఎంతో నమ్మకం తో వచ్చే ప్రజల పట్ల మనం బాధ్యత యుతంగా ఉండాలని… వారి నమ్మకాన్ని కాపాడటం తో పాటు వారు సంతోషం గా వెళ్లేలా చూడాలని అన్నారు .

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, AO రాజేంద్రనాథ్, EDM రాజు కుమార్, వివిధ సెక్షన్ ల సూపరింటెండెంట్ లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

.

Share This Post