తరలుదాం రండి మన జన్మ భూమికి…తల్లి పాల రుణం కొంత తీర్చడానికి గ్రామాల్లో వైద్య శిబిరాలు అభినందనీయం తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్య రంగంలో గుణాత్మక అభివృద్ధి అమెరికా స్థాయిలో… ప్రజల హెల్త్ ప్రొఫైల్ కరోనా అదుపులో మనమే నెంబర్ వన్ దేవరుప్పులలో అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

జనగామ, అక్టోబర్ 12: భారత దేశ మూలానికి చెందిన అమెరికా వైద్యుల సంఘం చే దేవరుప్పుల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి, ఉన్నత అవకాశాల కోసం ఉన్న ఊరుని, కన్న తల్లినీ వదలి వెళ్లిన డాక్టర్లు తమ రుణం తీర్చుకోవడానికి, అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న డాక్టర్లు కలిసి అమెరికా అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ అరిజిన్ గా ఏర్పడ్డారన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా, మన దేశంలోని 75 గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని వీరు నిర్ణయించినట్లు ఆయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జనగామ జిల్లాలోని దేవరుప్పుల, చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామాలను ఎంపిక చేయడం మన అదృష్టమని మంత్రి అన్నారు. దేవరుప్పుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదివిన నాగేంద్ర ప్రసాద్ శాన్ ఫ్రాన్సిస్కో లో కాన్సూల్ జెనరల్ గా పని చేస్తున్నారన్నారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు జరిపి, అమెరికా వైద్యులతో సంప్రదింపులు చేసి, రోగాలకు అవసరమైన మందుల సిఫారసు చేస్తారన్నారు. నేరుగా రోగుల ఫోన్ల కే వాట్సాప్ ద్వారా మొత్తం సమాచారం అందిస్తారన్నారు. ఈ శిబిరంలో మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ , మూత్రపిండాల సమస్య, రక్తహీనత, ఉబకాయం, ఆక్సిజన్ కొరత,హెచ్బీఏ 1సి, బిపి సిబిసి, లిపిడ్ ప్రొఫైల్ , క్రియాటినిన్ మెట్రిక్ , పల్స్ ఆక్సీ మెట్రీ , ఎత్తు బరువు పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (అంటే…మనలో ఆ రోగాలు ఉన్నట్లే తెలియనివి) ఎక్కువగా ఉన్నాయన్నారు. నిర్వాహకుల పరంగా ఇది మంచి ప్రయత్నంమని మంత్రి అన్నారు. నిర్వహకులను అభినందిస్తూ, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పరిమిత సంఖ్యలో కాకుండా మరింత మందికి మీ సేవలు అందించాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కెసీఆర్ నాయకత్వంలో వైద్య సదుపాయాలు బాగా మెరుగుపడ్డయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వెయ్యికి పైగా రోగాలకు ప్రభుత్వమే వైద్యం చేయిస్తున్నదన్నారు. ప్రతి జిల్లా హాస్పిటల్ లో ఐసియు లు, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పాత దవాఖానలను బలోపేతం చేస్తూనే, కొత్త హాస్పిటల్స్ ని పెట్టామన్నారు. విశ్వ నగరం హైదరాబాద్ నగరానికి నలుమూలలా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ పెడుతున్నామన్నారు. తెలంగాణలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. దేశంలో వైద్య రంగంలో మనమే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్ గా మారిందన్నారు. అనేక మందుల కంపెనీ లు మన దగ్గరకే వస్తున్నాయన్నారు. ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయడం సాధ్యం కాదని, ఇలా సంస్థలు, వ్యక్తులు కూడా సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. కార్పొరేట్ సోషల్ బాధ్యతగా పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి సేవలకు ముందుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వైద్యాధికారి డా. ఏ. మహేందర్, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, వైద్యులు, నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post