తల్లితండ్రుల ఆకాంక్ష లు నెరవేర్చేలా .. యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

*తల్లి తండ్రులు ఆకాంక్షల ను నెరవేర్చేలా యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి : జిల్లా అదనపు కలెక్టర్*

– ప్రతిభకు పేదరికం అడ్డు కాదు

– ప్రణాళిక బద్దంగా కష్టపడి చదివితే సులువుగా ఉద్యోగం చేజిక్కిo చు కోవచ్చు.

 

-జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
—————————
*తల్లి తండ్రులు ఆకాంక్షల ను నెరవేర్చేలా యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలనీ జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు.

గురువారం రాత్రి జిల్లా గ్రంధాలయం ను సందర్శించి… యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న తీరును జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శంకరయ్య తో కలిసి పరిశీలించారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శంకరయ్య
పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువతకు చేసిన ఏర్పాట్లను వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ యువత ను ఉద్దేశించి మాట్లాడారు.

మంత్రి కె టి ఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే తెలంగాణ లోనే ఎక్కడా లేనివిధంగా అన్ని హంగులతో కూడిన గ్రంధాలయ భవనం నిర్మాణం సాధ్యమైoదన్నారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శంకరయ్య గ్రంధాలయం లో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నార నీ అన్నారు.

ఈ గ్రంధాలయం ను సద్వినియోగం చేసుకోనీ ప్రణాళిక బద్దంగా కష్టపడి చదివి
ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని అన్నారు.

—————————–

 

Share This Post