తల్లిదండ్రులు కోల్పోయి అనాధలైన బాలలకు చెక్కుల పంపిణీ 19మంది బాలబాలికలకు 3 లక్షల 82 వేల విలువైన చెక్కులు పంపిణీ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

తల్లిదండ్రులు కోల్పోయి అనాధలైన బాలలకు చెక్కుల పంపిణీ

19మంది బాలబాలికలకు 3 లక్షల 82 వేల విలువైన చెక్కులు పంపిణీ

            జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

     తల్లిదండ్రులు కోల్పోయి అనాధలైన బాల బాలికలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

    జిల్లా మహిళ ,పిల్లల, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధలైన 19 మంది బాలబాలికలకు 3 లక్షల 82వేల రూపాయల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సహాయాన్ని పొందలేకపోయిన అనాధ బాలలు సంబంధిత శాఖను సంప్రదించి ప్రభుత్వం అందించే ఈ సదుపాయాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అని అన్నారు. ఈ కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలల మంచి చెడులు, వారు ఎదుర్కొంటున్న లను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత ఉద్యోగాలు చేయాలని ప్రోత్సహించారు. వారి బాగోగులు చూసుకుంటున్నావారి సంరక్షకులతో కూడా చర్చించి పిల్లలను బాగా చూసుకోవాలని కోరారు. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని, గురుకుల పాఠశాలలు ప్రవేశం కల్పిస్తానని అన్నారు. కంటి చికిత్స అవసరం ఉన్నా బాలునికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి రిఫర్ చేసి తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా తెలిపారు. ఆస్తికి సంబంధించిన సమస్య గల కుటుంబానికి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

     జిల్లా మహిళా, పిల్లల, వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖకు సమగ్ర బాలల పరిరక్షణ విభాగం పరిధిలోని అనాధ బాలలకు వారు చదువు కొనసాగించుటకు, వైద్య ఆరోగ్య పోషకాహారం అందించే నిమిత్తం స్పాన్సర్షిప్ పథకం ద్వారా నెలకు 2000/- చొప్పున మూడు సంవత్సరాల వరకు అందించబడునని, మార్చ్ 2022 వరకు  97 బాలబాలికలకు అందులో కోవిడ్ చే అనాధలైన 7గురు, కొవిడ్ కాలంలో అనాధలైన 44 మంది మరియు అంతకుముందే అనాధలైన 46 మంది బాలలకు మొత్తం 19 లక్షల 40వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి తెలిపారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జూవేరియా dcpu సిబ్బంది శాంతా, తిరుపతి కవిత, రమేష్ తదితరులు పాల్గొన్నారు

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి , కరీంనగర్ చే జారీ చేయబడినది.

Share This Post