తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి గొప్ప మానవ వనరులను అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు

తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి గొప్ప మానవ వనరులను అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు

తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి గొప్ప మానవ వనరులను అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన గావించి సర్వే పల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకటవ తరగతి నుండి 7 వ తరగతి వరకు చదివే విద్యార్థుల మానసిక స్థితి, పరిపక్వత, వారి వైఖరి ని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు బోధించడం గొప్ప విషయమని, అలాగే పుస్తకాలలో ఉన్న జ్ఞానమే కాకుండా వారు సత్ప్రవర్తన, నడవడిక తో మెలిగి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుటలో గురువుల పాత్ర ఎనలేనిదని అన్నారు. సమాజానికి అవసరమైన ప్రాధాన్యతను గుర్తిస్తూ అందుకనుగుణంగా విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. మన దేశంలో తల్లిదండ్రుల తరువాత గురువులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి గౌరవిస్తున్నారని, అందుకే మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని పూజిస్తున్నారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాణం, సమాజ మార్పు లో గురుతర భాద్యత నిర్వర్తించాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 19 మంది ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఈ అవార్డు గ్రహీతలు మిగతా వారికి స్ఫూర్తిదాయకంగానిలుస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాలరాతిమ సింగ్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, సెక్స్టోరల్ అధికారులు సుభాష్, సూర్య ప్రకాష్ రావు, మండల విద్యాధికారులు నీలకంఠం, నరసింహులు, బుచ్చయ్యనాయక్, ఏ.డి. శంకర్, సూపరింటెండెంట్ పద్మ, అవార్డుగ్రహీతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post