తల్లి తండ్రులు పిల్లలకు న్యుమోనియా వ్యాధి రాకుండా సరైన సమయంలో టీకాలు వేయించి శిశుమరణాలను తగ్గించాలన్న జిల్లా కలెక్టర్ హరిత .

ఒక సంవత్సరంలోపు పిల్లలకు న్యుమోకోకల్ కాంజుగేట్ వాక్సిన్ తప్పకుండా ప్రతి తల్లి తండ్రులు వేయించాలని జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు .

గురువారం కలెక్టరేట్ కాన్ఫిరెన్స్ హాలులో జిల్లా స్థాయి అధికారులతో న్యుమోకోకల్ కాంజుగేట్ వాక్సిన్ పైన రివ్యూ మీటింగ్ జరిగినది .ఈ సందర్భంగా జిలా కలెక్టర్ మాట్లాడుతూ న్యూమోనియా వలన 16%మంది పిల్లలు మరణిస్తున్నారు వీటిని అరికట్టడానికి ఒక సంవత్సరంలోపు ప్రతి శిశువుకు మొదటి డోసు ఆరువారాలకి,రెండవ డోసు 14 వారాలకు ,బూస్టర్ డోసు 9 నెలలకు వేయించాలన్నారు .

ఈ వ్యాధి నిరోధక టీకా ప్రైవేట్ హాస్పిటల్ నందు ఎక్కువ ఖరీదు ఉన్నందువల్ల ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సాధారణ వ్యాధి నిరోధకాలతో పాటు ప్రతి బుధవారం ,శనివారం ఇవ్వడం జరుగుతోందన్నారు . మన జిల్లాలో 12017 మంది పిల్లలను గుర్తించడం జరిగినది కావున తల్లి తండ్రులు పిల్లలకు న్యుమోనియా వ్యాధి రాకుండా సరైన సమయంలో టీకాలు వేయించి శిశుమరణాలను తగ్గించాలన్నారు . వైద్య ఆరోగ్య శాఖతో పాటు ICDS, విద్య, మునిసిపాలిటీ,సంబంధిత శాఖల అధికారులు సమావేశాల్లో ఈ వాక్సిన్ పైచర్చించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు .

ఈ కార్యక్రమం ఈనెల 18 తారీఖు నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ ,జడ్పీ సీఈఓ ,DMRHO డాక్టర్ మధుసూదన్ చల్లా ,DRDO ,DR .I ప్రకాష్ ,డిఐవో ,DR. అశ్విని కుమార్ PODTT ,DEO ,DWO ,DPRO ,మునిసిపల్ కమీషనర్ పరకాల ,నర్సంపేట్ ,Dy DEMO అనిల్ కుమార్ ,సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు .

Share This Post