తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి….

తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి….

ప్రచురణార్థం

తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి….

మహబూబాబాద్, మే -09:

తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి సిజేరియన్ కు ముహూర్తాలు పెట్టకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక పురోహితులు, అర్చకులు, పండితులను కోరారు.

సోమవారం ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా వైద్య అధికారులు, పురోహితులు, అర్చకులు, పండితులతో సిజెరియన్ కు ముహూర్తాలు పెట్టకుండా సహకరించు టకు సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సీజరియన్ వలన భవిష్యత్తులో తల్లి, పిల్లలకు నష్టం వాటిల్లుతుందని, అమృత ఘడియలలో పుట్టాలని ముహూర్తాలు పెట్టాలని చదువుకున్న వారు, చదువుకోనీ వారు అందరూ మీ దగ్గరికి వచ్చి ముహూర్తాలు పెట్టుకొని సిజెరియన్ డెలివరీ కు వెళ్తున్నారు అని చెప్పారు. నొప్పులు ఎందుకు భరించాలి అనే ఉద్దేశ్యంతో కూడా సిజెరియన్ కు వెళ్తున్నారని, భవిష్యత్తులో వచ్చే నష్టాలను దృష్టిలో పెట్టుకొని దీనిని అరికట్టాలని అందుకు సిజేరియన్ కొరకు ముహూర్తాలు పెట్టకుండ సహకరించాలని కోరారు.

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 65 నుండి 67 శాతం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 95 నుండి 99 శాతం వరకు సిజీరియన్ ఆపరేషన్ లు జరుగుతున్నాయని, రాష్ట్ర స్థాయిలో 60 శాతం ఉంటే జిల్లా లో 74 శాతం ఉందని, పుట్టిన వెంటనే బిడ్డకు గంట లోపల పాలు త్రాగించని సందర్భంలో రోగ నిరోధక శక్తిని కోల్పోవడం జరుగుతుందని, సాధారణ ప్రసవం లో పుట్టిన వెంటనే తల్లి పాలు తాగించే అవకాశం ఉందని, సిజరియన్ జరిగిన సందర్భంలో పాలు పట్టే అవకాశం ఉండదని తెలిపారు. కాబట్టి తల్లి, పిల్ల ఆరోగ్యం దృష్ట్యా సిజెరియన్ జరగకుండా చూడాలని, వాటికోసం ముహూర్తాలు పెట్టకుండా సహకరించాలని తెలిపారు.

ఆధార్ కార్డ్ లలో పుట్టిన తేది మార్చి పెళ్ళిళ్ళు చేయించడానికి కొందరు మా దగ్గరకు వస్తున్నారని పండితులు తెలుపగా, ఆధార్ కార్డులకు మార్పులు చేస్తున్న వారిపై, దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హరీష్ రాజ్, అర్చక ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా అర్చక పురోహితులు, పండితులు జిల్లా కలెక్టర్ కు శాస్త్రోక్తంగా ఆశ్వీర్వచనం అందించి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డి.ఎం.అండ్ హెచ్. ఓ. హరీష్ రాజ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, డివిజనల్ ఇన్స్పెక్టర్ కవిత, దేవాదాయ శాఖ అర్చకులు, పురోహితులు, పండితులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post