తహసిల్దార్ కార్యాలయం లో ఫైల్స్ పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు ఫైల్స్ ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                          తేది 29-11-2021

తహసిల్దార్ కార్యాలయం లో ఫైల్స్ పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు ఫైల్స్ ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

సోమవారం గద్వాల్ మండలం  లోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం లోని ప్రతి ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయానికి సంబంధించిన ద్రువపత్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు ఇచ్చే ఆదాయ, కుల ధ్రువ పత్రాలను ఆలస్యం చేయకుండా సమయానికి అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. మీ-సేవ లో సమర్పించిన దరఖాస్తులు నేరుగా తహసిల్దార్ కార్యాలయానికి వచ్చేలా చూడాలని అన్నారు. మీ-సేవ ఆపరేటర్ లు డాకుమెంట్స్ అన్ని సరిగ్గా అప్లోడ్ చేసేలా, ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతే  ఎంట్రీ చేసేలా వారికి తగిన సూచనలు చేయాలని అన్నారు. కార్యాలయం లో ఫైల్స్,  రిజిస్టర్ లు అప్డేట్ ఉంచాలని అన్నారు. ఎంత మంది వి.ఆర్.ఎ లు ఉన్నారని, మొత్తం సిబ్బంది ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్ని పరిశీలించారు, పెండింగ్ లో ఉన్న జి.ఎల్.ఎం ఫైల్స్ ను చెక్ చేశారు. అనాథరైజ్డ్ లె అవుట్ లకు సంబంధించిన ఫైల్స్ అన్ని పరిశీలించి, వాటి సర్వే నెం.ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫైల్స్ కు సంబంధించిన సాఫ్ట్ కాపీ లు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వ భూమలు, అసైన్డ్ భూమలు , సీలింగ్ భూముల వివరాలను   అడిగి తెలుసుకున్నారు.

ఎం.ఆర్.ఓ లక్ష్మి, డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి,  కార్యాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారిచే జారి చేయనైనది.

 

Share This Post