తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ఎలాంటి దరఖాస్తు అయినా పెండింగులో ఉంచడానికి వీలు లేదని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తాసిల్దార్ లను ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                                    తేది 08.09.2021

తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ఎలాంటి దరఖాస్తు అయినా పెండింగులో ఉంచడానికి వీలు లేదని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తాసిల్దార్ లను ఆదేశించారు.

బుధవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో తాసిల్దార్ ల తో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్ సైట్ ద్వారా భూముల సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పట్టాదారు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్లు, డి ఎస్ పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. సమస్య ఎలాంటిదో అర్జీ ఫారాల పై రాయాలన్నారు సాధ్యమైనంత వరకు మండల కేంద్రంలోని భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ సెక్షన్లో ఫైలు పెండింగ్ ఉన్నాయో తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాల వల్ల వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసిన నివేదికలు ప్రభుత్వానికి పంపాలన్నారు. త్వరలో జరిగే వినాయక చవితి పండుగ ఉత్సవాలకు కోవిడ్ నిబంధనల ప్రకారం జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతి ,ఇరిగేషన్ , రెవెన్యు సిబ్బంది మండల స్తాయి టీంలు ఏర్పాటు చేసుకొని మీ ఏరియాలో ఉండే కేనాల్స్,చెరువులు,   చెక్ చేసుకోవాలి. గణేష్ పండుగ సందర్బంగానిమ్మజన   కార్యక్రమం లో ఎలాంటి సమస్య రాకుండా చుసు కోవాల్లన్నారు

నిమజ్జన కార్యక్రమాలు కూడా అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్ డి ఓ రాములు అన్ని మండలాల తహసిల్దార్లు , సంబదిత అధికారులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

Share This Post