తాండూర్ రాజీవ్ స్వగృహ సమీపంలోగల మనోహ టౌన్షిప్ ఫ్లాట్ లను జూన్ 14న వేలం వేయనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్…

తాండూర్ రాజీవ్ స్వగృహ సమీపంలోగల మనోహ టౌన్షిప్ ఫ్లాట్ లను జూన్ 14న వేలం వేయనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
బుధవారం తాండూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ప్లాట్ల వేలంపై సంబంధిత అధికారులతో కలిసి వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాండూరు-హైదరాబాద్ రహదారికి దగ్గరలో ఉన్న యాలల మండలం కోకట్ గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 52 నందు దు మోహ టౌన్షిప్ లో గతంలో వేసిన వేలంలో మిగిలిపోయిన ప్లాట్లకు వేలం వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వమే స్వయంగా ప్లాట్ల వేలం వేయడం జరుగుతున్నందున అందులో తప్పనిసరిగా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా ప్లాట్లకు పకడ్బందీ రిజిస్ట్రేషన్, గ్యారెంటీ ఉంటుందని ఆమె అన్నారు. ముఖ్యంగా తాండూరు పరిసరాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినందున సమీపంలో ఉన్న ప్లాట్లకు భవిష్యత్తులో మంచి విలువ పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీవో అశోక్ కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి వినయ్ కుమార్, జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాల డిప్యూటీ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్, తాహసిల్దార్ చిన్న అప్పలనాయుడు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ తాండూర్ సమావేశానికి వెళ్తున్న మార్గమధ్యలో గల దుగాపూర్ , ఖాజాపూర్ గేట్ ల వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం చూసి కలెక్టర్ అక్కడే ఉన్న ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో సుష్మ సర్పంచులు పి.లలిత, లలిత మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపుల దగ్గరగా ఉండేలా మొక్కలు నాటేందుకు అనువుగా గుంతలు తీయించాలని సూచించారు. చైతన్య నగర్ పంచాయతీ కార్యదర్శి గుంతలు తీయించడం లో నిర్లక్ష్యం వహిస్తున్నందున తగు చర్యలకై ప్రతిపాదనలు పంపాలని పెద్దేముల్ ఎంపీడీవో ను కలెక్టర్ ఆదేశించారు
తదనంతరం జిల్లా కలెక్టర్ తాండూర్ మార్కెట్ యార్డులో లో ఏర్పాటు చేసే సమీకృత మార్కెట్ ను, క్రీడా ప్రాంగణం, ఎన్టీఆర్ కాలనీ లోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
కలెక్టర్ తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, కౌన్సిలర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post