తాడిపర్తి, గోపాల్ పేటలోని వ్యాక్సిన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన, తేది:20 .10 .2021
వనపర్తి

యుద్ధప్రాతిపదికన వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టి, 100% టార్గెట్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, సంభందిత అధికారులను ఆదేశించారు.
బుధవారం వనపర్తి జిల్లాలోని తాడిపర్తి, గోపాల్ పేటలోని వ్యాక్సిన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో వాక్సిన్ తీసుకొని వారికి వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చేలా అవగాహన కల్పించి, వ్యాక్సిన్ వేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్ తాడిపర్థి, గోపాల్ పేట గ్రామాలలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు.
తాడిపర్తి గ్రామంలో 3951 మందికి గాను, 1767 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు, మిగిలినవారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆమె తెలిపారు. రెండోసారి అర్హత కలవారికి జాప్యం లేకుండా టీకా అందించాలని ఆమె సూచించారు. గోపాల్పేట్ టిఎంసి పరిధిలో 4160 మందికి గాను, 3855 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని, మిగతా వారికి రెండు రోజులలో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించి, 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ పేట ఎంపీడీవో కరుణశ్రీ, డిప్యూటీ డి.ఎం.హెచ్.వో. శ్రీనివాసులు, ప్రత్యేక అధికారి అనిల్, డాక్టర్. రవి శంకర్, డాక్టర్ రాంచందర్, మంజుల, తాడిపర్తి సర్పంచ్ పద్మా, గోపాల్ పేట సర్పంచ్ శ్రీరాం, ఉప సర్పంచ్ రామకృష్ణ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
… ……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post