తాసీల్ధార్లు, BLO లు, AEO లు, ERO లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

బిఎల్ వో లు గరుడ ఆప్, ఓటర్ ఆప్ లను డౌన్లోడ్ చేసుకోవాలి

పోలింగ్ కేంద్రాల వివరాలు సరి చూసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

0000

బిఎల్ వో లు ( బూత్ లెవెల్ ఆఫీసర్) తప్పనిసరిగా గరుడ ఆప్ తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ ఆప్ లను డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ ల ద్వారానే ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల వివరాలు తీసుకునే వీలు ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని మండలాల ఈ ఈఆర్ఆర్ఓలు, ఏఈఆర్వో లు, బిఎల్ వో ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఈ ఆర్ ఓ లు, ఈ ఆర్ ఓ లు, బి ఎల్ వో లు ఓటర్ హెల్ప్ లైన్ యాప్, గరుడ యాప్ డౌన్లోడ్ చేసు కోవాలని ఆదేశించారు. బి ఎల్ వో లు గరుడ ఆప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వివరాలు సరి చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్ టాయిలెట్స్ తదితర సౌకర్యాలు చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాల ఫోటో తీసుకోవాలని తెలిపారు. కొత్తగా ఓటర్ నమోదయ్యేందుకు సమర్పించిన ఫారాలను సరి చూసుకోవాలని ఏ ఈ ఆర్ వో లు, ఏ ఈ ఆర్వోలను ఆదేశించారు. ఓటర్ జాబితా లను పరిశీలించి మరణించిన వారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వారం రోజుల గడువు తర్వాత పేర్లను తొలగించాలని అన్నారు. ఓటర్ జాబితాలను సిద్ధం చేసి పెట్టుకోవాలని తెలిపారు. ముందుగా ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ రామ్ రెడ్డి ఓటర్ హెల్ప్ లైన్ యాప్, గరుడ యాప్ లపై ఏఈఆర్వో లు,ఈ ఆర్ వో లు, బి ఎల్ వో లకు అవగాహన కల్పించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, హుజరాబాద్ ఆర్డిఓ రవీందర్ రెడ్డి అన్ని మండలాల ఈ ఆర్ వో లు, ఏ ఈ ఆర్ ఓ లు, బి ఎల్ వో లు పాల్గొన్నారు.

 

Share This Post