ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, తీవ్రమైన ఎండ, వేడిమి మరియు వడగాలుల నుండి పశు పక్ష్యాదులను రక్షించుకోవలసిన బాధ్యత పశువుల యజమానులపైన, వారికి సరైన యాజమాన్య పద్ధతులు తెలుపవలసిన బాధ్యత అధికారులపైన ఉందని అన్నారు.
వేసవిలో పశుగ్రాస కొరత ఏర్పడకుండా జాగ్రత్త పడాలని, చల్లని, శుభ్రమైన తాగునీరు పశువులకు అందేలా చూడాలని కోరారు. ఆవాసాలలో, దారి వెంట ఏర్పాటు చేసిన నీటి తొట్లకు అవసరమైన మరమ్మతులు, తొట్లకు నీటి సరఫరా సరిగా జరగాలని గ్రామ పంచాయతీలను, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. తీవ్రమైన ఎండలకు అనారోగ్యం పాలైన పశువులకు సరైన వైద్యం అందేలా చూడాలని పశు సంవర్ధక అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ, DCSO గారు, ఇతర పశు వైద్య అధికారులు పాల్గొన్నారు.
