రైతు ఉత్పత్తి సంఘాలు విజయవంతం అయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ముందుగా అలాంటి వ్యాపారం చేస్తున్న సంస్థలను సందర్శించి వ్యాపారం పై అవగాహన పెంపొందించుకోవాలి- జిల్లా కలెక్టర్ -పి.ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన
తేది: 1-10-2022
నాగర్ కర్నూల్ జిల్లా.
రైతు ఉత్పత్తి సంఘాలు విజయవంతం అయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ముందుగా అలాంటి వ్యాపారం చేస్తున్న సంస్థలను సందర్శించి వ్యాపారం పై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ రైతు వేదికలో రైతు ఉత్పత్తి సంఘాలు, నాబార్డ్ డి.డి.యం, బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో ఈక్విటీ గ్రాంట్ మరియూ క్రెడిట్ గ్యారెంటీ పథకాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తి కంపెనీలు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే మర్కెట్ ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల ఫై విషయ పరిజ్ఞానం అవసరమని తెలిపారు. రైతు ఉత్పత్తి దారుల కంపెనీలు ముందుకు సాగాలంటే ఇంతకు ముందు ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారిని సంప్రదించి ఒడిదుడుకులు లాభ నష్టాల పై విషయ పరిజ్ఞానం పొందాలన్నారు. వారు పండించిన ఉత్పత్తులకు విలువను జోడించి అమ్మితే లాభసాటిగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా తమకు మ్యాచింగ్ గ్రాంట్స్ రావాలంటే ముందుగా తమ వాటా జమ చేయాల్సి ఉంటుందన్నారు. చాలా మంది తమ పెట్టుబడిని మౌళిక సదుపాయాలు, యంత్రాలను కొనుగోలు చేయుటకు పెట్టేస్తారని తర్వాత వ్యాపారం చేయుటకు తమ దగ్గర పెట్టుబడి ఉండదన్నారు. అలాంటి పరిస్థితిలో ఇంతకుముందు తెచ్చిన బ్యాంకు రుణాలను వాయిదాలు తిరిగి చెల్లించ లేక ఇటు వ్యాపారం చేయలేక ఇబ్బందులు పడి నష్టాలతో తమ వ్యాపారాన్ని ముసుకుంటారన్నారు. అందుకే తమ పెట్టుబడి వ్యాపారం చేసేందుకు ఉంచుకోవాలని కనీసం రెండు మూడు సంవత్సరాలు నిలదొక్కుకొని వ్యాపారం చేస్తే ఆ తర్వాత ఖచ్చితంగా లాభాలు ఆర్జించవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్న సెంట్రల్ సెక్టార్, నాబార్డ్ ఐకెపి నుండి ఉన్న రైతు ఉత్పత్తి దారుల కంపెనీలు సుస్థిరతతో నిలదొక్కుకునేలా కృషి చేయాలనీ కోరారు . ఈ సందర్భముగా రిసోర్స్ పర్సన్ గా వచ్చిన ఎస్. నాగ బ్రహ్మచారి ఈక్విటీ గ్రాంట్ మరియూ క్రెడిట్ గ్యారెంటీ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, రైతు ఉత్పత్తి దారులకు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమములో పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ పి. వెంకటేశ్వర్లు, నాబార్డ్ జిల్లా అధికారి డి.డి.యం. షణ్ముఖ చారి, జిల్లా రైతు ఉత్పత్తిదారుల వివరాలు అనుబందలను కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎఫ్.సి. నుండి ప్రసన్న, రిసోర్స్ పర్సన్ ఎస్. నాగబ్రాహ్మ చారి, కె.వి.కె కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి చంద్రశేఖర్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ పాండే, రైతు ఉత్పత్తి దారుల కంపెనీ డైరెక్టర్లు సి.ఈ.ఓ లు పాల్గొన్నారు.
———–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post