తెలంగాణకు సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ ::జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం……2 తేది 11.10.2021
తెలంగాణకు సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ ::జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల,అక్టోబర్ 11:- బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రానికి సాంస్కృతిక చిహ్నమని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు . సోమవారం రోజున స్దానిక డిఆర్డిఎ కార్యాలయం ఆవరణలో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి సంస్కృతి రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని,ప్రపంచంలో ఎక్కడాలేని పూల పండుగ మన బతుకమ్మ పండుగని,ఈ పండుగను అందరం కలిసి కుల మత బేదాలను మరచి చేసుకుంటామని అన్నారు. మన రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక సంపదకు బతుకమ్మ చిరునామా లాంటిదని,అద్బుతమైన ఈ పండుగను బావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
టీఎన్జీవో అధ్యక్షులు భోగ శశిధర్, సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, ట్రెస అధ్యక్షులు వకిల్, హరి అశోక్ కుమార్, మహిళా ఉద్యోగులు, ప్రజలు జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ ::జిల్లా కలెక్టర్ జి.రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయనైనది.

Share This Post