తెలంగాణకు హరితహరo కార్యక్రమంలో భాగంగా 2022-23, 2023-24 సంవత్సరాలలో మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు గూగుల్ మీట్ ద్వారా,  జిల్లా గ్రామీణాభివృద్ది , అటవీ , పంచాయితీ, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, రోడ్లు భవనాలు, ఎక్సైజ్, పంచాయితీ రాజ్, మున్సిపల్, తదితర శాఖలు వచ్చే 2022-23, 2023-24 సంవత్సరాలకు గాను హరితహారం కార్యక్రమంలో జిల్లా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను రెండు మూడు రోజులలో సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు పెంపకం చేపట్టాలని, అవెన్యూ ప్లాంటేషన్ లో పెద్ద మొక్కలతో సిద్దం కావాలని తెలిపారు.
గూగుల్ మీట్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి , డి.ఎఫ్.ఓ వెంకటేశ్వర్ రెడ్డి , జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా ఎక్సైజ్ అధికారి కృష్ణ ప్రియ, జిల్లా ఉద్యానవన అధికారి, జిల్లా రోడ్లు భవనాల అధికారి, మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.

Share This Post