తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను విశదీకరణ చేసి గణన చేపట్టాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి లు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పాలనాధికారులను ఆదేశించారు

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 30 ( సోమవారం).

తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను విశదీకరణ చేసి గణన చేపట్టాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి లు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పాలనాధికారులను ఆదేశించారు.
సోమవారం 2019-20 సంవత్సరంలో జిల్లాల్లో హరితహారం కింద నాటిన మొక్కలను విశదీకరణ, గణన చేపట్టడంపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్స్, ఎడిషనల్ కలెక్టర్స్, డిఆర్డిఏ, అటవీశాఖ అధికారులతో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పాలనా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అడిషనల్ కలెక్టర్ టీఎస్ దివాకర వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడుతూ అధికారులను సమన్వయం చేసుకొని మొత్తం 132 సైట్లలో 11 టీమ్స్ ను ఫామ్ చేసి హరితహారం మొక్కల విశదీకరణ, గణన చేపట్టడానికి అన్ని ప్రణాళికలు రూపొందించి ఒక ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మొక్కల గణన పూర్తి చేసి వెబ్సైట్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎఫ్ఓ లావణ్య, డిఆర్డిఏ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post