తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయరహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు త్వరితగతిన పూర్తీ చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 04, 2021ఆదిలాబాదు:-

            తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయరహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు త్వరితగతిన పూర్తీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం రోజున జైనథ్ మండలం బోరజ్ చెక్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి నంబర్ 44 రోడ్డుకు ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో జాతీయ రహదారి 85 కిలో మీటర్ల మేర విస్తరించి ఉందని, అట్టి రహదారికి ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ కొరకు 47,750 మొక్కలను నాటి సంరక్షించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఇందులో 76 కిలో మీటర్లలో 37250 మొక్కలు గ్రామీణ ప్రాంతంలో,  ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 9 కిలో మీటర్లలో 10500 మొక్కలు నాటే కార్యక్రమం ఉందని వివరించారు. జిల్లాలోని ఆరు మండలాల్లోని 38 గ్రామపంచాయితీల పరిధిలో మొక్కలు నాటవలసి ఉందని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో గుంతలు తవ్వించాలని సూచించారు. ఇప్పటివరకు 17,629 గుంతలను 1391 మంది ఉపాధి హామీ కూలీలతో తవ్వించడం జరిగిందని, వెనువెంటనే ఎవెన్యూ ప్లాంటేషన్ కు మొక్కలు, ట్రీ గార్డ్ ల సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. మిగిలిన వాటిని రోజుకు ఐదు వేల చొప్పున గుంతలను తవ్వించి మొక్కలను నాటి లక్ష్యాన్ని అధిగమించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాను హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు ప్రణాళికలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్ణిత సమయంలోగా పూర్తీ చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఎపిడి రవీందర్ రాథోడ్, జైనథ్ మండల అభివృద్ధి అధికారి గజానంద్, అటవీ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post