తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగాపురం లిక్కర్ ఫ్యాక్టరీ వద్ద మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
7 8 2021
వనపర్తి

తెలంగాణకు హరితహారం కార్యక్రమం వనపర్తి జిల్లాలో 90 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. శనివారం పెబ్బేరు మండలం రంగాపురం లిక్కర్ ఫ్యాక్టరీ దగ్గర ఒకేసారి మూడు వేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద 27 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికతో ముందుకు పోదామని ఇప్పటికి 22 లక్షల మొక్కలు నాటాము అని తెలిపారు. ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున 255 గ్రామ పంచాయతీల పరిధిలో 6 లక్షల 10,000 మొక్కలు నాటినటు తెలిపారు. మిగతా మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

……

జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post