తెలంగాణకు హరితహారం కింద నాటిన అన్ని మొక్కలకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా క్రమం తప్పకుండా నీరు పోస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు.

తెలంగాణకు హరితహారం కింద నాటిన అన్ని మొక్కలకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా క్రమం తప్పకుండా నీరు పోస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు.

శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారిలు వివిధ అంశాలపై జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హరితహారం సబ్జెక్టు పై సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి నాయక్ చీఫ్ సెక్రటరీ తో మాట్లాడుతూ ,గ్రామపంచాయతీ ట్రాక్టర్లతో పాటు, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నామని, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శిలు క్రమం తప్పకుండా మొక్కలకు నీరు పోస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ప్రత్యేకించి శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు, అన్ని స్థాయిలలో హరితహారం మొక్కలకు నీరు పోస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు ,బృహత్ పల్లె ప్రకృతి వనాలలో కూడా మొక్కలకు నీరు పోయాలని, మొక్కలకు నీళ్లు పోసే విషయాన్ని అందరు జిల్లా కలెక్టర్లు సీరియస్ గా తీసుకోవాలని, వేసవిలో ఎండలు ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని మొక్కలు బ్రతికి ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

జిల్లాలో 555 పల్లె ప్రకృతి వనాలు ఉండగా గడచిన 3 రోజులలో అన్ని గ్రామ పంచాయతీలోని పల్లె ప్రకృతి వనాలన్నింటికీ నీరు పోశామని ,ఇందుకు సంబంధించి ఫోటోలతో సహా తెప్పించినట్లు జిల్లా కలెక్టర్ సిఎస్ కు వెల్లడించారు. అంతేకాక పట్టణాలలోని పట్టణ ప్రకృతి వనాల మొక్కలు కూడా మీరు అందిస్తున్నట్లు తెలిపారు

వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ మార్చి 8న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు సంబంధించి ప్రతి మంగళవారం పూర్తిస్థాయిలో వారి ఆరోగ్య సమస్యలపైనే పరీక్షించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ కేంద్రాలలో క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉంటుందని, ఎవరికైనా పెద్ద ఆసుపత్రులకు రేఫర్ చేయాల్సి వస్తే పంపించడం జరుగుతుందని, అంతేకాక ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ లాంటి వాటికి కూడా పంపిస్తామని తెలిపారు. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అన్ని రకాల ఈక్విప్ మెంట్ , సామాగ్రిని పంపించడం జరుగుతుందని, ఫ్రీ డయాగ్నస్టిక్, రేడియాలజీ మిషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించడమే కాకుండా, డిఆర్డిఓ, మెప్మా మహిళా సంఘాల ద్వారా కూడా గ్రామాలు, పట్టణాలలో అందరికీ తెలియజేయాలని కోరారు.ఎంపిక చేసిన పి హెచ్ సి లలో ఆరోగ్య మహిళ కీయస్క్ ఏర్పాటు చేసి అక్కడే స్క్రీన్ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఇటీవల కాలంలో గుండె జబ్బుల కారణంగా అనేకమంది మరణిస్తున్నారని, ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో గుండెజాబులతో ప్రతి సంవత్సరం 24,000 మంది చనిపోతున్నట్లు అంచనా వేయడం జరిగిందని ,ఇటీవల రాజేంద్రనగర్, వరంగల్ తదితర ప్రాంతాలలో పోలీసులు ,వైద్యులు సిపిఆర్ చేయడం వల్ల గుడ్డ జబ్బు నుంచి బయటపడి ప్రాణాలు రక్షించడం జరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ నెలలోనే సిపిఆర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి పదిమందిలో 9 మంది గుండెపోటు వల్ల మరణిస్తున్నారని ,అలా కాకుండా సిపిఆర్ చేస్తే కనీసం సగం మంది బతికే అవకాశం ఉందని, కరోనా తర్వాత గుండె పోటు కేసులు పెరిగాయని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు, మున్సిపల్ ,పంచాయతీ సెక్రటరీలు, ఆశ ,అంగన్వాడి అపార్ట్మెంట్లలో ఉండే గేట్ కీపర్లు, అసోసియేషన్ పెద్దలు ,గెట్టెడ్ కమ్యూనిటీ తదితర అందరికీ సిపిఆర్ పై అవగాహన కల్పిస్తే చాలామందికి ప్రాణాలు కాపాడిన వారామవుతమని, ఇది చాలా మంచి కార్యక్రమమని అందువల్ల ఈ కార్యక్రమం పై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలని, ఇందుకుగాను ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రైనర్లను పంపిస్తున్నామని, ఈ ట్రైనింగ్ కార్యక్రమాలను సంబంధిత జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వామ్యం చేసి ప్రారంభించాలని ఆయన కోరారు. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రాలు ,పల్లె దవఖానాలు, బస్తీ దౌఖానాలలో ఏబిడి మిషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కంటి వెలుగు కార్యక్రమం పై మంత్రి సమీక్షిస్తూ కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలలో బాగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఇంకా 25 వేలు ఇవ్వవలసిందని వాటిని కూడా పంపిణీ చేయాలని చెప్పారు .ప్రతి కేంద్రంలో 100కు పైగాప్రజలు తప్పనిసరిగా వచ్చేలా చూడాలని ,జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు కూడా కంటి వెలుగు వైద్య శిబిరాలను తప్పకుండా సందర్శించాలని కోరారు.

15వ ఆర్థిక సంఘం నిధులపై మంత్రి మాట్లాడుతూ నిర్మాణాలకు సంబంధించిన నిధులు తప్ప తక్కిన వాటిని ఆసుపత్రి అభివృద్ధి సంస్థల కు నిధులు బడలయించాలని, ఇందుకుగాను జిల్లా పరిషత్తు చైర్మన్ల సహకారం తీసుకోవాలని ఆయన తెలిపారు.

మార్చి 8న మహిళలకు 2018- 19, 20 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరుగుతుందని, ఇందుకోసం గ్రామాలు పట్టణాల వారీగా అధికారులు ప్రొసీడింగ్స్ సిద్ధం చేసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు వడ్డీరేని రుణాల కింద ఇవ్వడం జరుగుతున్నదని మంత్రి వెల్లడించారు.

జిల్లా ఎస్పీ నరసింహ, స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ,డి ఆర్ డి ఓ యాదయ్య, జిల్లా అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .

 

Share This Post