తెలంగాణకు హరితహారం జిల్లాలో ఈవత్సరం కెనాల్ అండ్ ప్లాంటేషన్ విరివిగా చేపట్టేవిధంగా తగు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమే అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

మే.06 ఖమ్మం

తెలంగాణకు హరితహారం కింద జిల్లాలో ఈ సంవత్త్సరం కెనాల్ బండ్ ప్లాంటేషన్ విరివిగా చేపట్టేవిధంగా తగు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఎం.పి.డి.ఓ.లు, తహశీల్దార్లు, ఎం.పి.ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణకు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు స్థలాల కేటాయింపు, కెనాల్ బండ్   ప్లాంటేషన్, మన ఊరు మనబడి అంచనాలు. తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం. జిల్లాలో హరితహారం కింద కెనాల్ బండ్ ప్లాంటేషను ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. తదనుగుణంగా ఎన్.ఎస్.పి.ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్స్, నీటిపారుదల శాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలలో విరివిగా మొక్కలు నాటేందుకు గాను, ఇర్రిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, ఎం.పి.డి.ఓలు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి స్థలాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కెనాల్ బండ్ ప్లాంటేషన్ కొరకు ఇప్పటికే గుర్తించిన విస్తీర్ణం, ఇంకనూ గుర్తించాల్సిన కెనాల్ బండ్స్, ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఇండనూ బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని, గుర్తించిన స్థలాలు మొక్కలు నాటేందుకు అనువుగా ఉన్నట్లు ఎం.పి.డి.ఓలు ద్రువీకరించాలని కలెక్టర్ సూచించారు. దీనితోపాటు కొత్తగా చెరువులు ఏర్పాటుకు గాను స్థలాలను గుర్తించాలని యాభై శాతం అటవీయోతర ప్రాంతంలో స్థలాలు ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలకై ఇప్పటికే గుర్తించిన స్థలాలను మొక్కలు నాటేందుకు అనువుగా సిద్ధం చేయాలని స్థలం చదును చేయడం, గుంతలు తవ్వకం వంటి పనులను ప్రారంభించడంతో పాటు నీటి వసతి ఏర్పాటుకై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మన ఊరు- మన బడి కింద మొదటి దశలో ఎంపికైన పాఠశాలలో ఇంజనీరింగ్ అధికారులు సమర్పించిన అంచనాలకు సంబంధించి పాఠశాలలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సందర్శించి విద్యార్థుల అవసరాలకనుగుణంగా మాత్రమే అవసరమైన పనులకు అంచనాలను సవరించి సమర్పించాలని, ఎం.పి.డి.ఓలను, ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్ మధు సూదన్, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి. అప్పారావు, ఖమ్మం, సత్తుపల్లి, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్లు రవికుమార్, ఆనంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు పిడి శిరీష, తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Share This Post