తెలంగాణకు హరితహారం లో భాగంగా జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.

తెలంగాణకు హరితహారం లో భాగంగా జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.

మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి అధ్యక్షతన ఆయన చాంబర్లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన 2022, 2023 మరియు 2024 సంవత్సరాలకు గాను జిల్లాలో వివిధ శాఖల ద్వారా నాటవలసిన మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు.

జిల్లాలో 2022 సంవత్సరం 46.06 లక్షల మొక్కలు, 2023 సంవత్సరం 40.76 లక్షలు, 2024 సంవత్సరంలో 35.46 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యంగా నిర్దేశించారు.

అందుకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు నర్సరీలలో మొక్కలు పెంచాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా ఆయా అధికారులు ప్రణాళికతో లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు,జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సంక్షేమ శాఖల అధికారులు, పశుసంవర్ధక, ఉద్యాన శాఖ, విద్య, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post