తెలంగాణకు హరిత హారం, పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి, వైకుంఠధామం, సెగ్రీగేషన్ షెడ్లు, ఉపాధిహామీ పనుల పై తహశీల్దార్లు, MPDOs, MPOs, APOs, DLPOs లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ .

 

పల్లెలు ప్రకృతి వనాలతో కళ కళ లాడాలి

ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీలలో 100% చేయాలి

పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
000000

పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, పల్లెలు ప్రకృతి వనాలతో కళకళలాడేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారము పల్లె ప్రగతి పనులు, క్రిమిటోరియం ఉపాధి హామీ పనులు, సేగ్రి గేషన్ షెడ్, ప్లాంటేషన్, నర్సరీల పై కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, ఏ పీ ఓ ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులను గ్రామ పంచాయతీలలో 100% చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తిచేయని వైకుంఠధామం లను వచ్చేనెల అక్టోబర్ రెండవ తేదీ లోగా పూర్తిచేయాలని ఎంపీడీవో లను తహసిల్దార్ లను ఆదేశించారు. ఎంపీడీవోలు ప్రతిరోజు గ్రామాలను సందర్శించి పల్లె ప్రగతి పనులపై రోజువారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను, గుర్తించిన స్థలాల్లో మొక్కలు నాటించాలని తెలిపారు. ప్లాంటేషన్ కోసం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల స్థలాన్ని గుర్తించాలని అన్నారు. స్థలాలు అందుబాటులో లేని చోట కుంటలు, గుట్ట ప్రాంతాల వద్ద ప్లాంటేషన్ చేయాలని తెలిపారు. నర్సరీలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గ్రామాలలో తడి, పొడి వేరు చేసి తడి చెత్త తో కంపోస్టు ఎరువు తయారుచేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.అన్ని మండలాల్లో కోవిడ్ వాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు పై బడిన వారికి వ్యాక్సినేషన్ మొదటి డోసు ఇవ్వాలని, మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. మండలాల వారీగా 18 సంవత్సరాలు పైబడిన వారిని సర్వే చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు తహసిల్దార్ లు, ఏపీఓలు సమన్వయంతో
కలిసి పని చేసి పల్లె ప్రగతి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, డీఎఫ్వో బాలామణి, డి ఆర్ డి ఓ శ్రీలత, డి పి ఓ వీర బుచ్చయ్య, ఆర్ డి వో లు ఆనంద్ కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post