తెలంగాణకు హరిత హారం పై జరిగిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్.

2022-23 హరితహారంలో జిల్లాలో  40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

              00000

 2022 – 23 సంవత్సరానికి   హరితహారంలో 40 లక్షల  మొక్కలు నాటేందుకు లక్ష్యంగా  ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు –

 సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరిత హారం కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జూన్ మొదటి వారంలో గ్రామాల్లో మొక్కలు నాటుటకు  ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి గుంతలు తీసి మొక్కలు నాటుటకు సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పి, ఇరిగేషన్ కెనాల్స్, రోడ్ల వెంబడి ఖాళీ స్థలాలను గుర్తించి ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో నర్సరీలు జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజులకు ఒక సారి ఎంపిడిఓలు, ఫారెస్ట్, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకొని నివేదికను సమర్పించాలని అన్నారు. 2022-23 సంవత్సరానికి హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, అందులో ఎంపిడీఓలకు 31 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. నీటి ఎద్దడిని తట్టుకుని పెరిగే మొక్కలు మలబార్, వేప చెట్లు పెంచే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. నాటిన చెట్లు వంగిపోకుండా ఉండేటందుకు ఊత కర్రలు పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హరిత హారంలో నాటిన మొక్కలను రక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమీషనర్ సేవ ఇస్లావత్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా విద్యాధికారి జనార్థన్ రావు, ఈ.ఈ. శ్రీనివాస్,  ఎక్సైజ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, తదితరులు ,పాల్గొన్నారు.

Share This Post