తెలంగాణకు హరిత హారం 7వ విడత ప్లాంటింగ్ లక్ష్యం పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి ,

తెలంగాణకు హరిత హారం 7వ విడత ప్లాంటింగ్ లక్ష్యం పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి ,

ప్రచురణార్థం—1
తెలంగాణకు హరిత హారం 7వ విడత ప్లాంటింగ్ లక్ష్యం పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి , జూలై 31:- జిల్లాలో తెలంగాణకు హరిత హారం 7వ విడత ప్లాంటింగ్ లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అటవీశాఖ అధికారులు,రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణకు హరిత హారం 7వ విడత ప్లాంటింగ్ లక్ష్యం పై సమీక్షించి, లక్ష్యం పూర్తిచేయాలని అన్నారు.అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖల భూవివాదాలపై జిల్లా అటవీ శాఖ అధికారి మరియు అటవీ శాఖ క్షేత్రాధికారులతో సమీక్షించి, అటవీ శాఖ వారి సిబ్బంది సైట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి వాస్తవాలు తనిఖీ చేసి కారాణాలు సమర్పించవలెనని,అడవుల పునరుధ్ధరణ (Forest Rejuvenation) లో భాగంగా, బ్లాకుల వారీగా సమీక్షించి, ఆక్షన్ ప్లాన్ 2021-22 అనుగుణంగా పనులు చేపట్టబోయే వివరాలు సమర్పించవలెనని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, అదనపు కలెక్టర్ (లోకల్ భాడీస్)కుమార్ దీపక్,డి.ఎఫ్. ఓ.రవి ప్రసాద్,అటవీశాఖ, రెవెన్యూశాఖ అధికారులు,తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి గారిచే జారీచేయబడినది.

తెలంగాణకు హరిత హారం 7వ విడత ప్లాంటింగ్ లక్ష్యం పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి ,

Share This Post