తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు.

తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు.

 

రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న మంత్రి శ్రీ కే తారక రామారావు, మున్సిపల్ చైర్మన్ లు, కమిషనర్ లు

– సిరిసిల్ల , వేములవాడ వచ్చిన అవార్డ్ ల ను మంత్రి శ్రీ కే టి ఆర్ తో కలిసి స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్ లు, కమిషనర్ లు

 

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా.. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా.. శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఆయా అవార్డులను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయా పట్టణాల చైర్మన్లు, చైర్‌పర్సన్స్‌ అవార్డులను అందుకున్నారు.

జిల్లా నుంచి సిరిసిల్ల , వేములవాడ మున్సిపాలిటీకి లభించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను మంత్రి శ్రీ కేటీఆర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లు , మున్సిపల్ కమిషనర్ లతో కలిసి అందుకున్నారు.

 

దేశవ్యాప్తంగా 4,355 స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని చేపట్టగా.. ఇందులో తెలంగాణలోని 16 మున్సిపాలిటీలు సత్తా చాటి..అవార్డులను సాధించాయి. మొత్తం 90 అంశాలను ప్రాతిపదికన తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు వంటి అంశాల వారీగా అవార్డులను ఎంపిక చేశారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీల్లో ఆది బట్ల, బడంగ్‌పేట్, భూత్‌పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్ కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరుడుచర్ల, సికింద్రాబాద్, సిరిసిల్ల, తుర్కయాంజల్, వేములవాడ ఉన్నాయి.

 

 

Share This Post