తెలంగాణలోని ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామాలుగా కావాలి ::మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

తెలంగాణలోని ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామాలుగా కావాలి ::మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

పాలనా పరమైన సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతి లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.

ఆదివారం రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో 20లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గోపితో కలిసి మంత్రి వర్యులు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

గ్రామ పంచాయతీలకు ప్రతినెలా ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నామన్నారు .

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం సియం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రివర్యులు తెలిపారు.

వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ..అవసరమైన సాగునీరు, కరెంటు, పెట్టుబడి అందించి, గిట్టుబాటు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికే చెందుతుందన్నారు.

కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కెసిఆర్ అన్నారు.

అనంతరం వెంకటేశ్వర పల్లెలోని రైతు వేదిక,వైకుంఠ ధామం,డంప్ యార్డ్ లను మంత్రివర్యులు పరిశీలించారు.

వైకుంఠ ధామం చుట్టూ గ్రీనరీని పెంచాలని ఎంపీడీఓ కిషన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు .

అంతకు ముందు మంత్రి వర్యులు, కలెక్టర్ గార్లు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

Share This Post