తెలంగాణలో ఆదర్శ గ్రామాల రూపకల్పన దిశగా ఏర్పాట్లు :: రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

తెలంగాణలో ఆదర్శ గ్రామాల రూపకల్పన దిశగా ఏర్పాట్లు :: రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

పత్రికాప్రకటన                                                                                                                తేదిః 02-09-2021

తెలంగాణలో ఆదర్శ గ్రామాల రూపకల్పన దిశగా ఏర్పాట్లు :: రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

          జగిత్యాల, సెప్టెంబర్ 02: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందని  రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు.  బుదవారం  పెగడపెల్లి మండలంలో బతికేపెల్లి గ్రామంలో ఎస్సి కార్పోరేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ, జూట్ బ్యాగుల తయారి శిక్షణ కొరకు ఎంపికైన అభ్యర్థుల అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ విశిష్ట అతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా మంత్రి మంత్రి వర్యులు మాట్లాడుతూ,  గ్రామ అభివృద్ది, యువత ఉపాధి కల్పనపై అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ, ఉపాధి కార్యక్రమం ద్వారా ధర్మపురి మండలంలో మొదటిసారి 50మంది మైనారిటి యువతులకు కుట్టుశిక్షణను అందించడం జరిగిందని అన్నారు.  ఎస్సి, ముస్లీం, క్రిస్టియన్ మైనారిటిలకు పేదరీకం నుండి విముక్తి కల్పించేలా అనేక కార్యాక్రమాలను రూపకల్పనచేయడం జరిగిందని,  రాపెల్లి గ్రామంలో చేపట్టిన కార్యక్రమం ద్వారా యువతకు శిక్షణను అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించడం జరిగిందని, బతికేపల్లి గ్రామంలో కూడా 20మంది ముస్లీం యువతులకు శిక్షణను అందించి కుట్టుమిషన్లను అందించి వారికి ఉపాధిని కల్పించడం జరిగిందని పేర్కోన్నారు.  ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్మతను పెంపొందించగలిగేలా ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటి గ్రామాలను ఎంచుకోని, ఎంపికైన వారికి ముందుగానే కుట్టుమిషన్ అందించి మూడునెలల శిక్షణను అందించి సర్టిఫికెట్లను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.  అంతే కాకండా ప్రతి యూనిట్ సభ్యులకు 2 లక్షల70  వేల నుండి 4 లక్షల విలువగల ఒక ఎంబ్రాయిడరి మిషన్ అందించడం  జరుగుతుందని,   తయారికి ఉపయోగపడే ముడిసరుకు, మార్కెటింగ్ సంబంధించి ఇబ్బందులు లేకుండా,  ఎమాత్రం లేకుడా సంస్థనుండే అందించడం జరుగుతుందని అన్నారు.  300 వందలమందితొ ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకొని వారితో నాణ్యమైన ఉత్పాదనలు తయారి చేయించి ఎగుమతి చేయడం జరుగుతుందని,   విద్యార్థులకు యూనిఫాం కుట్టించడం వంటి కార్యక్రమాలను నేరుగా మీరే చేయడం ద్వారా ఆర్థిక అభివృద్దిని సాధిస్తారని పేరోన్నారు.   అభివద్దిలో బాగంగా ఎస్సి కార్పోరేషన్ ద్వారా ధరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన వారందరికి ప్రోత్సాహం అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.  కుట్టు, జూట్ బ్యాగుల తయారికి విద్యార్హతతో సంబంధం లేకుండా సాధించాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.   గ్రామ అభివృద్దికి నిరంతరం కృషిచేస్తున్నాని, గ్రామ అభివృద్దిలో అందరు చొరవ చూపించాలని, 7 లక్షల 80వేల రూపాయలతో కేనాల్ అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుందని,  ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులో ప్రసవాలను చేయడం జరుగుతుందని,  ఒంటరి మహిళ పెన్షన్ వంటి దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని,  ఎస్సి కాలనీలలో ఇళ్లలోకి కాలువ నీరు రాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కోన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ,  టెయిలరింగ్, జూట్ బ్యాగుల శిక్షణ ద్వారా లబ్దిదారులు సంతృప్తిని వ్యక్తం చేశారని, మనకు ఉన్న విద్యార్హతకు తగ్గట్టుగా ఉద్యోగాలు పొందడం కష్టతరంగా మారిన తరుణంలో వివిధ రంగాల ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వివిధ సంస్థలు వివిధ రంగాలలో శిక్షణను అందించడం ద్వారా మీరు నైపుణ్యత సాధించి ఇతరులపై ఆధారపడకుండా, మీ కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని అన్నారు.  ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు జిల్లాతొ పాటు ధర్మపురి నియోజక వర్గంలొ అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశారని పేర్కోన్నారు. యువత శిక్షణ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకొని యువత ముందుండాలని అన్నారు.

కార్యక్రమం చివరగా లబ్దిదారులకు వివిధ ఉపకరణాలను అందించారు.

ఈ కార్యక్రమంలొ ఈడి ఎస్సి కార్పోరేషన్  లక్ష్మీనారాయణ,  మైనారిటి  రైతుబందు సమితి మండలశాఖ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి  కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

తెలంగాణలో ఆదర్శ గ్రామాల రూపకల్పన దిశగా ఏర్పాట్లు :: రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

తెలంగాణలో ఆదర్శ గ్రామాల రూపకల్పన దిశగా ఏర్పాట్లు :: రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

Share This Post