తెలంగాణలో సర్వ మతాలు సమానం. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలు. అందరి మనోభావాలను ప్రభుత్వం గుర్తిస్తుంది. సూర్యాపేట నియోజక వర్గంలో దుస్తుల పంపిణి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

తెలంగాణలో సర్వమతాలు సమానమని అందరి మనోభావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.  గురువారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ కనుక దుస్తుల పంపిణి కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాదించ్చుకున్నాక అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. క్రైస్తవ సోదరుల మనోభావాలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న పాత చర్చిల మరమ్మతులు, కొత్త చర్చి ల నిర్మాణం అలాగే సమధుల అభివృద్ధి చేయడం జరిగిందని అలాగే కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కూడా చేపట్టామని ముక్యంగా యువత ఉన్నత చదువులు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. అంబెడ్కర్, మహాత్మా గాంధీ కన్నా కలలు తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.  తెలంగాణలో ప్రజలు పండుగలు పూర్వ వైభవం తో సంతోషంగా చేసుకుంటున్నారని అన్నారు. అనంతరం నియోజక వర్గం నుండీ వచ్చిన లబ్దిదారులకు పాస్టర్ల సమక్షంలో పండుగ కనుక దుస్తులు అందచేశారు. క్రైస్తవ సోదరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు నియోజక వర్గాలకు క్రైస్తవ సోదరులకు పండుగ కనుక దుస్తులు జిల్లాకు ప్రభుత్వం పంపించడం జరిగిందని మొదటగా సూర్యాపేట నియోజక వర్గంలో 1000 పండుగ కానుకలు మంత్రి గారిచే లబ్దిదారులకు అంద చేశామని అన్నారు. మూడో ముప్పు పొంచి ఉన్నందున కరోనా నిరారణకు వ్యాక్సిన్ తప్పనిసరియని  జిల్లాలో ఈ నెల 31 వరకు కరోనా వ్యాక్సిన్ నూరు శాతం పూర్తి చేయాలని మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోవాలని ఆలాగే ఇతర కారణాలు చెప్పి తప్పించుకునే వారిని తక్షణమే గుర్తుగించి వ్యాక్సిన్ ఇప్పించాలని ఆయా మండలాల నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులు వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేసారు. జిల్లాలో అన్ని పురపాలికలలో వార్డుల వారీగా నూరు శాతం వ్యాక్సినేషన్ జరిగేలా మున్సిపల్ చైర్ పర్సన్లు కృషి చేయాలని అన్నారు. ముక్యంగా బాలింతలు, గర్భిణీలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యాక్సిన్ కి అర్హులని ఎలాంటి అపోవ వద్దని ఈ సందర్బంగా సూచించారు. జిల్లా ప్రజలందరూ మాస్క్ తప్పక ధరించాలని, తరుచుగా చేతులు శుభ్ర పరుచుకోవా లని , సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసారు.
     ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పి. అన్నపూర్ణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్.పి. వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా ఆనంద్, ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్,ఈ. డి. యస్.సి. కార్పొరేషన్ శిరీష,  తహశీల్దార్లు, పోస్టర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో సర్వ మతాలు సమానం.
క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలు.
అందరి మనోభావాలను ప్రభుత్వం గుర్తిస్తుంది.
సూర్యాపేట నియోజక వర్గంలో దుస్తుల పంపిణి.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

Share This Post