తెలంగాణాలో సంప్రదాయంగా జరుపుకునే బతుకమ్మ పండగా అనతికాలంలోనే ప్రపంచ గుర్తింపు పొందినదని నాగర్ కర్నూల్ శాసన సభ్యులు- మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు

పత్రిక ప్రకటన
తేది: 3-10-2022
తెలంగాణాలో సంప్రదాయంగా జరుపుకునే బతుకమ్మ పండగా అనతికాలంలోనే ప్రపంచ గుర్తింపు పొందినదని నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లాలో స్థానిక ట్యాన్క్ బండ్ పై సాయంత్రం పూట స్థానికంగా, అన్ని మండలాల నుండి వచ్చిన బతుకమ్మలతో అత్యంత కోలాహలంగా మహిళలు సంప్రదాయ నృత్యం చేస్తూ పండగ చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ దంపతులు, జడ్పి చైర్మన్ పి. పద్మావతి, శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు, జిల్లా అధికారులు, డి.సి.సి.బి డైరెక్టర్ జక్క రఘునందన్ సైతం ఆడుతూ మహిళల్లో ఉత్సాహన్నీ నింపారు. మున్సిపాలిటీ లోని వివిధ వార్డులు, ప్రభుత్వ శాఖలు, ఆయా మండలాల నుండి మహిళా సమాఖ్య ద్వారా మహిళలు తెచ్చిన బతుకమ్మలతో ట్యాన్క్ బండ్ సందడి చేసింది. తీరొక్క పూలతో తయారు చేసిన అత్యుత్తమమైన బతుకమ్మలు శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇందులో మెప్మా మహిళలు తయారు చేసిన బతుకమ్మ మొదటి బహుమతి పొందగా వైద్య శాఖ ఉద్యోగినులు తయారు చేసిన బతుకమ్మకు రెండవ బహుమతి లభించింది. మూడవ బహుమతి మహిళా సమాఖ్య ఐతోలు వారికి వరించగా తిమాజిపేట మహిళా సమాఖ్య వారు తయారు చేసిన నడియాడే బతుకమ్మకు కన్సోలేషన్ బహుమతి ఇచ్చారు.
సద్దుల బతుకమ్మ పండుగను నాగర్ కర్నూల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జరుపుకోవడం విశేషం.
——————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post