తెలంగాణా ఆవిర్భావ దినోత్సహాన్ని జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డి హరిచందన కలెక్టరేట్ ఆవరణం లో జాతీయ పతవిష్కరణ చేసి తెలంగాణా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు

తెలంగాణా ఆవిర్భావ దినోత్సహాన్ని జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డి హరిచందన కలెక్టరేట్ ఆవరణం లో జాతీయ పతవిష్కరణ చేసి తెలంగాణా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలిస్ పరైడ్ గ్రుండ్ లో జిల్లా కు ముఖ్య అథీథి గా హాజరైన డా.కె వి రమణ చారి  గారు మైదానం లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపన్ని నివాళ్లరిపించారు.అనంతరం పోలిసుల గౌరవ వందనన్ని స్వీకరించైనా తరువాత ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిథి  ప్రభుత్వ సలహా దారులు డా.కె వి రమణ చారి  గారు మాట్లాడుతూ,

రాష్ట్ర అవతరణ  దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా ప్రజానీకానికి నా  హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.

నారాయణపేట జిల్లాలో రాష్ట్ర  అవతరణ      వేడుకలు జరుపుకోవడం ఎంతో   ఆనందంగా ఉంది. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ ఎనిమిది ఏళ్ళలో బలమైన అడుగులు              వేయగలిగాం. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా మనం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిచ్చాయి. గతం సృష్టించిన సమస్యల వలయంలోంచి             బయటపడడమే కాకుండా, నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్                ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి            దక్కిన సార్థకతగా భావిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు     తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణాలు.

అనతికాలంలోనే రాష్ట్రం  అద్భుత విజయాలను సాధించిందని, వివిధ రంగాలలో రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం  అమలుచేస్తున్న పథకాలకు దేశ, విదేశాల నుంచి పలు ప్రశంసలు అందుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రం అమలుచేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది.

వ్యవసాయ శాఖ

             రైతుబంధు పథకము కింద యాసంగి 2021-2022 లో 1,67,313 మంది రైతులకు 229.55 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమచేయబడినవి. వానాకాలం 2018 నుండి యాసంగి 2021-22 వరకు 1,679 కోట్ల రూపాయలు  రైతుల ఖాతాలలో  జమ చేయబడినవి.

             ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా 2,756 కుటుంబాలకు రైతుభీమా పథకం  కింద రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ 135.8 కోట్లు వారి యొక్క నామినీ ఖాతాలలో జమచేయడం జరిగింది.

             వానాకాలం 2022-23కి గాను ఎరువులు సిద్ధంగా ఉంచడం జరిగినది. డీలర్లు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా 1889.89,    డి.ఏ.పి. 513 , కాంప్లెక్స్ ఎరువులు 1,867 , పొటాష్ ఎరువులు 135.87 టన్నులు అందుబాటులో ఉన్నాయి. మార్క్ ఫెడ్ నందు 5589.54 టన్నులు యూరియా,   డి.ఏ.పి. 220,కాంప్లెక్స్ ఎరువులు 624.35 , ఎరువులు టన్నులు బఫర్ స్టాకు కలదు.

ఎస్సీ ఎస్టీల సంక్షేమం

             దళితబంధు పథకము ద్వారా జిల్లాలో 183 మంది లబ్దిదారులను గుర్తించి 167 యూనిట్లను మంజూరు చేయడమైనది.

             భూమి కొనుగోలు పథకము ద్వారా 77 మంది భూమి లేని నిరుపేద హరిజన   మహిళలకు సుమారు 221.12 ఎకరముల భూమి పంపిణీ  చేయడము జరిగినది. ఇందుకు గాను మొత్తము రూ. 709.07 లక్షలు ఖర్చు చేయడము జరిగినది.

పల్లె ప్రగతి – జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

             తెలంగాణ క్రీడాప్రా౦గణముల కొరకు 336 గ్రామాలలో స్థలాలు గుర్తించడం జరిగినది. ఇప్పటివరకు 32 గ్రామాలలో పనులు పూర్తిచేయనైనది, ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రతి గ్రామంలో 1 ఎకరము క్రీడా ప్రాంగణం కలిగి ఉండును.

             తెలంగాణకు హరిత హారంలో భాగముగా 2022 -23 సం.లో 8వ విడత హరిత హర౦లో మన జిల్లాకు ఉపాధి హామీ పథకము ద్వారా 30.01 లక్షల మొక్కలు నాటుటకు  గాను మండలం వారీగా ప్రణాళిక సిద్దంచేయడం జరిగింది.

             జిల్లాలోని 11 మండలాలలో 55 బృహత్ పల్లె ప్రకృతి వనములు ఏర్పాటు చేయనైనది.

             ఆసరా పెన్షన్ లో వృద్ధాప్య, వితంతువు, చేనేత, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి స్త్రీలకు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా బాధితులకు నెలకు రూ. 2,016/- లు మరియు వికలాంగులకు  రూ. 3,016/- ల చొప్పున  మొత్తం 70,648  ఆసరా పెన్షన్ దార్లకు రూ. 16.71 కోట్లు మంజూరు చేయడము జరిగినది.

             బ్యాంకు లింకేజీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 7,357 స్వయం సహాయక సంఘాలకు రూ.192.57 కోట్లు ఋణాలు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఇప్పటివరకు  4,269 స్వయం సహాయక సంఘాలకు రూ.177.40 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగింది.

             జిల్లాలో స్త్రీనిధి Credit Plan Target 44.92 కోట్లకు గాను, రూ.16.50 కోట్ల రూపాయలు ఋణాలు  మంజూరు చేయడం జరిగింది. అలాగే NPA OD రూ.5.23 కోట్లు ఉన్నవి.

నారాయణపేట్ ఆరుణ్య హ్యాండ్లూమ్ హ్యాండి క్రాఫ్ట్స్ & ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్

             జిల్లాలోని 1500 ల మంది మహిళా సభ్యులతో వివిధ రకాల ఉత్పత్తులు: చీరలు, మాస్కులు, ఆయుర్వేద మాస్కులు, పోచంపల్లి మాస్కులు, ఆయుర్వేద స్ప్రే, వెదురు ఉత్పత్తులు, టెర్రకోట జ్యూవెలరీలు, FIG జామ్ మరియు జూట్ ఉత్పత్తులు  ఫ్లిప్ కార్ట్ మరియు అమేజాన్ ద్వారా ఆన్ లైన్ నందు కూడా అమ్మకాలు  చేయడము జరుగుతుంది.

             జిల్లాలోని మహిళలను అందరినీ ఒకే తాటి పైకి తెచ్చి వారి వారి ఉత్పత్తులకు  ప్రత్యేక బ్రాండ్  “ఆరుణ్య” పేరుతో వ్యాపారాలను  నిర్వహించేలా  ప్రోత్సహించడం జరుగుతుంది.

పల్లె ప్రగతి – పంచాయతి విభాగము

             మన రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలలోని అన్ని గ్రామాలను హరిత గ్రామాలుగా, పరిశుభ్రమైన గ్రామాలుగా, అందరికీ సురక్షితమైన త్రాగు నీరు అందించే గ్రామాలుగా  ఏర్పాటు లక్ష్యముగా జిల్లాలో గల 280 గ్రామ పంచాయతీల యందు నిరంతరంగా పల్లె ప్రగతి పనులు జరుగుతున్నాయి.

             రూ.55.65 కోట్ల నిధులను 2011 జనాభా ప్రాతిపదికన సంబంధిత గ్రామ పంచాయతీలకు జమ చేయటం జరిగినది. ఇట్టి నిధులను ప్రతి సంవత్సరము గ్రామములలో సానిటేషన్ మరియు హరితహారం లకు ఉపయోగించడం జరుగుతుంది.

పట్టణ ప్రగతి

             నారాయణపేట పట్టణంలో 50 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగినది. పట్టణ ప్రగతి ద్వారా మాంసాహార మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు, వయోవృద్ధుల ఆశ్రమ భవన నిర్మాణ పనులు, సమీకృత మాంసహార  మరియు శాఖహార  మార్కెట్ నిర్మాణ పనులు, వైకుంఠధామం  నిర్మాణ పనులు, గ్రంథాలయ భవన నిర్మాణ పనులు, రోడ్ల అభివృద్ది పనులు, కొండా రెడ్డి పల్లి చెరువు అభివృద్ది పనులు, మినీ స్టేడియం నిర్మాణ పనులు  పురోగతిలో వున్నవి. 20 కోట్లతో మఖ్తల్ మరియు కోస్గి పట్టణములలో డంపింగ్ యార్డ్ లు, పార్కులు       మరియు వివిద అభివృద్ది పనులు చేయడం జరిగింది.

అటవీ శాఖ

             జిల్లాలో హరితహారం అటవీ బయట ఈ సం. లో  40.00 లక్షల మొక్కలు లక్షమునకు గాను 40.09 లక్షల మొక్కలు నాటడం జరిగినది.

             ఈ హరితహారం వలన జిల్లాలో 1.1% అటవీ భూములు పెంచడం జరిగినది.

             2022 సం.లో 280 గ్రామపంచాయితీలకు గాను 298 నర్సరీలలో 96.67 లక్షల మొక్కలను పెంచడం జరుగుతున్నది.

             అటవీ జంతువుల దాహర్తి తీర్చడానికి 3 సోలార్ బోర్ వెల్ లను నిర్మించడం జరిగినది.

కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్

             పేద ఆడపిల్లల పెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పేరుతో  1,00,116 రూపాయలు అందిస్తున్నాం. కళ్యాణలక్ష్మి పథకము  ద్వారా జిల్లాలో 4,143 మంది  లబ్దిదారులకు రూ. 41.68 కోట్లు, షాదీ ముబారక్ పథకము ద్వారా 310 మంది  లబ్దిదారులకు రూ. 3.09 కోట్లు అందిoచడం జరిగినది.

 

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ

             చిట్టెం నర్సిరెడ్డి (సంగంబండ) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింద సివిల్ పనులు అన్ని పూర్తి అయినవి. రిజర్వాయర్  యొక్క  పూర్తి  సామర్థ్యం  3.317  టి.యం.సి.లలో 2.70 టి.యం.సి వరకు  నీరు నింపడం  జరిగింది.

             రాజీవ్ భీమా పథకం-I క్రింద 23,370 ఎకరాల ఆయకట్టుకు  నీళ్లు ఇవ్వడం జరిగినది.

విద్యుత్ శాఖ

             గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం విద్యుత్ సంస్థ తరపున జిల్లాలో 830 చాకలి మరియు 300 మంగలి వినియోగదారులకు ఉచిత విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది.

             జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరము నకు గాను తొమ్మిది 33/11 KV ఉపకేంద్రములు 14.23 కోట్ల రుపాయలతో మంజూరు చేయడం జరిగినది.

ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ

             సూక్ష్మ సేద్య పథకము క్రింద వివిధ వర్గాల రైతులకు  75%, 80%, 90% నుండి 100% వరకు రాయితీపై రూ. 2076.34 లక్ష్యమునకు గాను ఇప్పటివరకు రూ.2076.34 లక్షల వ్యయంతో 3281.92 హెక్టార్లకు గాను 2,237 రైతులకు లబ్ది చేకూర్చడం జరిగింది.

మార్కెటింగ్ శాఖ

             జిల్లాలో 93 వరి కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేయడం జరిగినది. వీటి ద్వారా క్వింటాలు రూ. 1,960/- చొప్పున మొత్తం 7.51 లక్షల క్వింటాళ్ల వరిని 11,712 మంది రైతుల ద్వారా కొనుగోలు చేయడం జరిగినది.

పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ

             గొర్రెల అభివృద్ధి పథకము లో భాగముగా జిల్లాలోని గొల్ల, కురుమ, యాదవ కుటుంబాల ఆర్థికాభివృద్దికి మరియు తెలంగాణ రాష్ట్రములో మాంస ఉత్పత్తిని పెంపొందించేoదుకు రాష్ట్ర ప్రభుత్వము గొర్రెల అభివృద్ధి కార్యక్రమము ప్రారంభించింది. ప్రస్తుతము జిల్లాలో 22,329 సభ్యులతో 214 సంఘాలు ఉన్నాయి.

మత్స్య శాఖ

             తెలంగాణా ప్రభుత్వము జిల్లాలోని రిజర్వాయర్లు   ఇరిగేషన్ చెరువులలో  100% రాయితీ పై చేప విత్తనములు సరఫరా చేయుటకు గాను జిల్లాలోని 707  ఇరిగేషన్ చెరువులలో రిజర్వాయర్లలో మొత్తం 179.11 లక్షల   చేప విత్తనములు సరఫరా చేయడం జరిగినది.

విద్యా శాఖ

             పాఠశాలల మౌలిక వసతులు, గుణాత్మక విద్య  కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా చేపట్టిన మన ఊరు – మనబడి , మన బస్తి – మన బడి కార్యక్రమమంలో భాగంగా రానున్న విద్యా సంవత్సరం నుండి జిల్లా లోని 334 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించనున్నారు.

             174 పాఠశాలలను  మొదటి విడత మన ఊరు – మనబడి కార్యక్రమంలో  నవీకరణ చేయడం జరిగింది.

మిషన్ భగీరథ

             జిల్లాలో ఇప్పటివరకు 419 ఆవాసాలకు మిషన్ భగీరథ పథకము క్రింద నీటి సరఫరా జరుగుతుంది. మిగిలినవి ప్రగతిలో ఉన్నవి.

             మిషన్ భగీరథ ఇంట్రా పథకంలో భాగంగా జిల్లాలో 453 ట్యాంకులు నిర్మించి, 1127.38 కిమీ పొడువునా పైపులైనులు వేయడం జరిగినది. 1,16,034 నల్లా కనెక్షన్లు ఇవ్వడం పూర్తి చేయబడినది.

పౌరసరఫరాల శాఖ

             తెలంగాణ రాష్ర్ట పౌర సరఫరాల సంస్థ ఈ రబీ సీజన్లో క్వింటాలుకు గ్రేడ్-A రకానికి రూ.1960 చొప్పున మరియు కామన్ రకానికి రూ.1940 చొప్పున మన జిల్లాలో 91 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి పండించే రైతుల నుంచి 1.20 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలి అని అంచనా వేయడం జరిగింది.  ఇప్పటి వరకు 12,105 మంది రైతుల నుంచి 153.68 కోట్ల విలువైన 78.40 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అందులో 7,551 మంది రైతులకు 87.30 కోట్ల రూపాయలను  చెల్లించడం జరిగినది.

వైద్య  మరియు ఆరోగ్య శాఖ

             నారాయణపేట జిల్లాలో KCR Kit కార్యక్రమం క్రింద గత సంవత్సరములో 2,277 మంది గర్భిణి  స్త్రీలకు KCR kit లను ఇవ్వడం జరిగింది.

వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ

             వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్దికిగాను జిల్లా నందు 4 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ లలో 780 మంది విద్యార్థులకు వసతి కల్పించబడుచున్నది.

             ఈ-ఆటో రిక్షా పథకo క్రింద ఈ సంవత్సరానికి గాను అత్యంత వెనుకబడిన తరుగతుల  వారికి  ఈ-ఆటో రిక్షాలు మంజూరు చేయనైనది.

షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ

             జిల్లా నందు మొత్తం 13 ప్రభుత్వ వసతి గృహములలో 1,723 మంది విద్యార్థులు  వసతి గృహములలో ఉచిత వసతి పొందుచున్నారు.

             కులాంతర వివాహాల పథకము నందు   ప్రతి జంటకు రూ.2.50 లక్షల చొప్పున  నగదు ప్రోత్సాహకం మంజూరు చేయబడును.

మైనారిటీ సంక్షేమ శాఖ

             రంజాన్ పండుగ సందర్భముగా ముస్లిం కుటుంబాలకు  2 నియోజకవర్గములలో 2,000 చొప్పున గిఫ్ట్ ప్యాక్స్ మరియు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయుటకు గాను రూ. 8.00 లక్షలు ప్రభుత్వము నుండి మంజురు చేయడము జరిగినది.

మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ

             జిల్లా లోని 704 అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహార లోప నివారణకు చిరు ధాన్యాల ద్వారా 11వేల గర్భిణి, బాలింత మహిళలకు మరియు 17 వేల చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది.

             కోటి రూపాయల వ్యయంతో నారాయణపేట పట్టణంలో వృద్ధాశ్రమాన్ని నిర్మించి వృద్దులకు ఆశ్రయం కల్పిస్తూ వాడుకలోకి తీసుకు రావడం జరిగింది.

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ

             మన ఊరు మన బడి   పథకము నందు మొత్తం 673 పనులు రూ.2857 లక్షలు మంజూరు కాబడినవి. ఇందులో 540 పాఠశాలలకు మరుగు దొడ్లు, 48 వంట గదులు, మరియు  85 పాఠశాలలకు ప్రహరి గోడలు  నిర్మించవలసియున్నవి.

రహదారులు మరియు భవనముల శాఖ

             ఐ.డి.ఓ.సి.  స్కీము క్రింద సమీకృత జిల్లా అధికారుల కార్యాలములకు, వసతికి  రూ.55.00 కోట్లు  మంజూరు చేయబడినవి మరియు వసతి గృహముకోసం 8.50 కోట్లు పరిపాలన అనుమతులు మంజూరు అయినవి.

చేనేత మరియు జౌళి శాఖ

             తెలంగాణ చేనేత శాఖ ద్వారా 8 కోట్లతో నారాయణపేట కు హాండ్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయనైనది.

             బతుకమ్మ పండుగ సందర్భంగా గత సంవత్సరం జిల్లాలో బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేయడం జరిగినది.

కార్మిక శాఖ

             భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేయుచున్న కార్మికులకు ఈ సం.లో వివిధ పథకముల క్రింద 5,844 కార్మికులను గుర్తించి వారికి భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక చట్ట ప్రకారం గుర్తింపు కార్డులు జారి చేయడం జరిగింది.

మన తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లా సర్వతోముఖాభివృద్దికై మనం అందరం కంకణబద్ధులం కావాలని కోరుచున్నాను. అభివృధ్ధి పనుల నిర్వహణకు శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనవి. శాంతి భద్రతలు నిర్వహణకు అహర్నిశలు కృషిచేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అభివృద్ధికి కృషిచేస్తున్న స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా యస్.పి. మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులను, స్వచ్చంద సేవా సంస్థలను, పాత్రికేయులను, ప్రజలను ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికై మనమందరము పునరంకితమవుదామని విజ్ఞప్తి చేస్తూ, ప్రగతి బాటలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు .

అనతరం పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన 09 మందికి సేవా పథకాలు అందించడం  జరిగింది

వారు:

1) సీతయ్య, మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్

2) అరుణ్ ASI. మక్తల్ ps.

3) యాదగిరయ్య, ARSI. DAR.

4) యాదయ్య, ARHC.407

5)D. అర్జున్ HC.1871

6)M.రామచంద్రయ్య HC. దామరగిద్ద పిఎస్.

7) రామకృష్ణ, HC. 1874

8) శివ యాదయ్య, PC.759

9) సుభాష్ రాథోడ్, PC.1898.

అనంతరం మైదానం లో బాల కేంద్రం వారి అద్వర్యం లో పలు సంశ్ర్కుతిక కార్యక్రమాలను తిలకించారు. అనతరం మైదానం లో  ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి అభినందనలు తెలిపారు.

Share This Post