తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఎంతో కృషి చేస్తునారని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఉండాలనే లక్ష్యం తో జిలాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తనీరు హరీష్ రావు అన్నారు.

పత్రిక ప్రకటన                                                            తేది:22-12-2021

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ఎంతో కృషి చేస్తునారని, ప్రతి జిల్లాకు ఒక  మెడికల్  కాలేజి ఉండాలనే లక్ష్యం తో  జిలాలో నర్సింగ్ కళాశాల  ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తనీరు హరీష్ రావు అన్నారు.

బుధవారం జోగులాంబ గద్వాల్ జిల్లా లో 300 పడకల జిల్లా ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి, మల్దకల్ మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేసారు .

తదనంతరం జిల్లా లో హిమాలయ హోటల్ లో వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లా లో 300 పడకల  ఆసుపత్రి  తో పాటు నర్శింగ్ కాలేజి అందుబాటులోకి రానున్నదని , ఈ రెండు పూర్తి అయితే జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని , సుమారు 20 పైగా స్పెషాలిటి సేవలు అందుతాయని,  హైదరాబాద్ వరకు రావలసినఅవసరం ఉండదని తెలిపారు.  అన్ని వైద్య సేవలు ఉచితంగా అందించి పేద వాడిపై ఎలాంటి భారం పడకుండా  చూడాలన్నారు.  జిల్లా ఆసుపత్ర్హి లో రేడియాలజి ల్యాబ్ మరియు ప్రత్యేకమైన చిన్న పిల్లల కేర్ సెంటర్  ను ప్రారంబించా మని, ఇందులో  ఎక్సరే , అల్ట్రాసౌండ్ , కాన్సర్ పరీక్ష , ఇ సి జి , సిటీ స్కాన్  వంటి ముక్యమైన పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  పేద ప్రజలు ప్రవేట్ ఆసుపత్రులకు వెళ్ళకుండా  ప్రభుత్వ ఆసుపత్రి లోనే అన్ని రకాల  ఉచిత  వైద్య సేవలు ఉపయోగించు కోవాలని  అన్నారు. పెండింగ్ లో ఉన్న ఆసుపత్రి అభివృధి పనులు  పూర్తి చేయాలనీ సంబందిత అధికారులకు ఆదేశించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ పై మాట్లాడుతూ జిల్లా లో మొదటి  మరియు రెండవ డోస్  పూర్తి చేసి జిల్లా లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా  చూడాలన్నారు.  జిల్లా లో    పోషణ లోపం ఉన్న పిల్లలకు పోషకాహారం అందించేలా  చూడాలన్నారు.  జిల్లా లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో  ఉన్న సిబంది వివరాలు  అడిగి తెలుసుకున్నారు.  వైద్య అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో   ఎం పి రాములు, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి అరుణ, జాడ్పి చైర్మెన్ సరితా తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,   స్తానిక శాశనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఆలంపూర్ శాశనసభ్యులు డాక్టర్ .అబ్రహం,  అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య అధికారి చందు నాయక్,  ప్రోగ్రాం అధికారులు , సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జిల్లా గారిచే జారీ చేయబడినది.

Share This Post