తెలంగాణా విద్యార్థులను ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణా విద్యార్థులను ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని  ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో మన ఊరు మనబడి మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో పనులకు శంఖుస్థాపన చేసి భూమి పూజ చేశారు.   తాడూర్ మండలం మెడిపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలకు కలిపి రూ. 1.65 కోట్లు, నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాలకు 46.16 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అదనపు గదులు, మరమ్మతులు, మౌళిక సదుపాయాల కల్పన పనులకు స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్,   ఎంపీ పి. రాములు, ఎమ్మెల్సీలు కాటే జనార్దన్ రెడ్డి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి,  విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి శంఖుస్థాపనలు చేసి భూమి పూజ చేశారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్యాభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి విద్యా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.  విద్యార్థుల తలిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కొరకు ఎంత ఖర్చు అయిన సరే ఆంగ్ల మాధ్యమంలో చదివించాలనే ఉద్దేశ్యంతో ప్రయివేట్ పాఠశాలలకు పంపిస్తున్నారన్నారు.  రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చి రాష్ట్రంలోని 26 వేల పారశాలల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, అన్ని పాఠశాలల్లో అన్నీ మౌళిక సదుపాయాలు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి ఈ విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికొఱకు విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ బాధపడవలసిన అవసరం లేదని ఉపాధ్యాయులకు పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా ఆంగ్ల మాధ్యతమం పై శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.  విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి పాఠ్యపుస్తకాల్లో ఒకవైవు తెలుగులో మరో వైపు ఆంగ్ల భాషలో ముద్రణ ఉండేటట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలతో పాటు పూర్తిస్థాయి ఉపాధ్యాయులను ఏర్పాటు చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.  దీనికోరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 7300 కోట్లు మొదటి విడతలో ఖర్చు చేసేందుకు   నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.  అదేవిధంగా గ్రామ ప్రజలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా తమ ఊరి రుణం తీర్చుకోడానికి ఒక మంచి సదవకాశం వచ్చిందని, మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగస్వాములై తమవంతు సహకారం అందించాల్సిందిగా కోరారు.  విద్యార్థులు ఏ ఒక్కరూ బడిబయట ఉండకుండా, విద్యార్థుల తలిదండ్రులు  ప్రయివేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా అందరూ బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు. పాఠశాలలు దేవాలయాల కంటే పవిత్రమైనవని  బడిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మొదటి విడతలో తీసుకున్న అన్ని పాఠశాలల్లో మరమ్మతులు, మౌళిక సదుపాయాలు లైట్లు, ఫ్యాన్లు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, తాగు నీరు, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్ తదితర అన్ని సౌకర్యాలతో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పూర్తి చేయాలని, కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఆహ్లాదకరమైన వారావరణంలో విద్యనభ్యసించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్ద పీట వేసి రెండింటిని సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నదన్నారు.  విద్యా పరంగా మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టి మూడు విడతలుగా విడతకు 7500 కోట్ల చొప్పున ఖర్చు చేసి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక హంగులతో అన్ని మౌళిక సదుపాయాలతో తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టిందన్నారు.  వైద్యంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.  విద్యారంగాన్నీ కొందరు వ్యాపార రంగంగా మారుస్తున్న తరుణంలో మన ఊరు మనబడి అనే మహత్తరమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్తమంత్రి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.  ఇంత మహత్తర మైన కార్యక్రమానికి ఒక మహిళ మంత్రిగా ఉండటం గొప్ప అదృష్టంగా అభివర్ణించారు.  ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సాగు,  తాగు  నీరు, విద్యుత్ పై దృష్టి పెట్టి విజయవంతం చేసి ఇప్పుడు విద్యా వైద్యం పై పూర్తిస్థాయి దృష్టి పెట్టడం జరిగిందన్నారు.  విద్యార్థులకు ఎదో చేయాలని నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 5 మండలాల్లో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను తీసుకొని ఆధునిక హంగులతో నిర్మించి ఇచ్చేవిధంగా ఒక్కో పాఠశాలకు 3 కోట్ల వ్యయంతో మొత్తం 15 కోట్లు తన స్వంత కష్టార్జితం డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.  ఇప్పటికే తిమ్మాజీపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభించుకోవడం జరిగిందని త్వరలోనే తాడూర్, సిర్సవాడలో ప్రారంభించుకోబోతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ విద్య ప్రగతికి నాంది అని పాఠశాలలను అన్ని మౌళిక సదుపాయాలతో తీర్చిదిద్దితే ప్రయివేట్ పాఠశాలలకు వెళ్లకుండా అందరూ ప్రభుత్వ పాటశాలల్లోనే నాణ్యమైన విద్యను అభ్యసిస్తారన్నారు. విద్యకు పెట్టుబడి పెడితే అది సమాజంలో సమూల మార్పు తెచ్చి ఎన్నో లాభాలను అర్జించి పెడుతుందని అన్నారు.  ఇంత గొప్ప కార్యక్రమము రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా నేడు ప్రారంభించుకోవడం మెడిపూర్ ప్రజల అదృష్టమని అన్నారు. ఇకనుండి ప్రయివేట్ పాఠశాలల ఆటలు సాగవని, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై గురుతర బాధ్యతలు పెరిగాయన్నారు.  పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలని తెలియజేసారు.

ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ కొందరు విద్యా వ్యవస్థను విచ్చిన్నం చేయాలని చూస్తున్న ఈ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం అభినందనీయమన్నారు.   సంవత్సరానికి 7500 కోట్లు పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయడం దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లాలో మహేంద్రనాథ్ కృషి వల్ల కొంత విద్యా పరంగా లబ్ది పొందారని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు.  ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉండాలని తాను కొత్త విషయాలు నేర్చుకొని విద్యార్తులకు నేర్పించాలని సూచించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.   దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని కొనియాడారు.

విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ మాట్లాడుతూ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలంటే చదువే ముఖ్యమన్నారు.  పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి నాణ్యమైన విద్యను ఆహ్లాదకరమైన వాతావరణంలో అందుంచేందుకు మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేసారు.  రాబోయే విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాద్యమం తో పాటు డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకె పంపించాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 290 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగిందని, చాలా వాటికి సాంకేతిక అనుమతులు, పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.  పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి పూర్తి  చేస్తామని పేర్కొన్నారు.

విద్యా సంక్షేమ మౌళిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రాహుల్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా వైద్యాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని  సంబంధిత శాఖాధికారులు సమన్వయం చేసుకొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  కె.టి.ఆర్.  కృషితో ఐ.టి రంగంలో అనేక కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయ న్నారు. ఈ తరుణంలో విద్యార్థుల నైపుణ్యం వెలికితీసి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో టీచర్స్ యూనియన్ ఎమ్మెల్సీ కె. జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న,  విద్యా శాఖ కమిషనర్ దేవసేన సైతం మాట్లాడారు.  డి.సి.సి.బి జిల్లా కన్వీనర్ జక్కా రఘునందన్, అదనపు కలెక్టర్ మను చౌదరి, ఆర్డీఓ నాగలక్ష్మి, ఇంచార్జి డి.ఈ.ఓ రాజశేఖర్, స్థానిక సర్పంచ్ ప్రమీల, జడ్పీటీసీ లు, ఎంపీపి లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share This Post