పత్రిక ప్రకటన
తేది 6-6-2023
తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొల్లాపూర్ చౌరస్తాలో రు. 62.2 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన సమీకృత కార్యాలయ సముదాయాన్ని సర్వ మత ప్రార్థనలతో ప్రారంభోత్సవం చేశారు. కలెక్టర్ ఛాంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పి. ఉదయ్ కుమార్ ను కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. మూడు సార్లు లేపి కూర్చోబెట్టిన అనంతరం తన శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేయించారు. జిల్లా ప్రజలకు మంచి పరిపాలన అందించి జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టాలని సూచించారు. అనంతరం సమీకృత కార్యాలయ సముదాయాన్ని అహర్నిశలు వెంట ఉండి కష్టపడి చక్కటి నిర్మాణం చేసినందుకు రోడ్లు మరియు భావనాల శాఖ అధికారులను శాలువాలు, మేమొంటో లతో సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్. పి. ఉదయ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, డి.జి.పి అంజనీ కుమార్ ను శాలువాలతో సత్కరించి మేమోంటో లు బహూకరించారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ