తెలంగాణ అమరవీరులకు ఘననివాళులు కీసర అమరవీరుల చిహ్నం వద్ద నివాళులర్పించిన మంత్రి మల్లారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో పతాకావిష్కరణ, పోలీసుల గౌరవవందనం స్వీకరణ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

పత్రిక ప్రకటన

తేదీ : 02–06–2022

తెలంగాణ అమరవీరులకు ఘననివాళులు

కీసర అమరవీరుల చిహ్నం వద్ద నివాళులర్పించిన మంత్రి మల్లారెడ్డి

కలెక్టరేట్ ఆవరణలో పతాకావిష్కరణ, పోలీసుల గౌరవవందనం స్వీకరణ

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు.  ఈ మేరకు ముందుగా కీసరలోని అమరవీరుల చిహ్నం వద్ద రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీస్, నైపుణ్యాభివృద్ది శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి గురువారం ఉదయం జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్  ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పెరేడ్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమావేశంలో వివరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి,  జాన్ శ్యాంసన్,  జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,  సైబరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ డీసీపీ రక్షితామూర్తి, జేడ్పి వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్యతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post