బుధవారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు – 2023 నల్లగొండ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే దేశం గర్వించేలా అభివృద్ధి చేసుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేశారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ రోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో గ్రామాలు వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి గ్రామాలలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని నల్లగొండ నియోజకవర్గ MPP లకు, ZPTC లకు, MPTC లకు, సర్పంచుల కు, ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏ శాఖ కార్యక్రమం ఏ హల్ లో నిర్వహించాలి అని కొన్ని హాల్ లను నిర్ణయించారు. మరి కొన్నిటిని అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అన్ని గ్రామాలలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆయన ఆదేశించారు. అట్లాగే నల్లగొండ మునిసిపాలిటీ పరిధిలోని 48 వార్డులలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నియోజవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమాలు మంచిగ చేస్తారో గుర్తించి ప్రత్యేక నగదు ప్రోత్సాహం అందిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆ గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులను కచ్చితంగా అహ్వానిచాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు.లబ్ధిదారులలో ముఖ్యంగా అసరా పెన్షన్దారులు, రైతుబంధు, రైతు బీమా లబ్ధిదారులు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, కెసిఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పథక లబ్ధిదారులు మొదలగు వారు ఈ కార్యక్రమాలలో పాల్గొనేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మున్సిపాలిటీ, మండలాల వారిగా వాట్స్అప్ గ్రూపులను క్రియేట్ చేయాలని ఆర్డీవోను కోరారు. కార్యక్రమాలలో భాగంగా రైతు వేదికలు, చెరువుల పండగ, పల్లె ప్రగతి, విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద సభలు ఏర్పాటు చేసి 1000 మందికి ల లబ్ధిదారులకు పైగా పాల్గొనేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో భాగంగా చెరువు కట్టల వద్ద శుభ్రపరచి, లెవలింగ్ పూర్తి చేసి సభ నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను ఆయన కోరారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వేదికలు స్థలాల్లో పరిశీలన, భోజన సదుపాయాలు వంటి విషయంలో వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. నా తరఫున ప్రతి గ్రామానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల పూర్తి వివరాలతో కూడిన డిజిటల్ వాల్ పెయింటింగ్ పోస్టర్లను పంపిణీ చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రోజువారి కార్యక్రమాలను ఆర్డిఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ రమణాచారి, ప్రజా ప్రతినిధులు పంకజ్ యాదవ్, అబ్బగొనీ రమేష్, వoగాల సహదేవరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ విజయలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పిలుునిచ్చారు.