తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అలరించిన కవి సమ్మేళనం* # కవి సమ్మేళనం ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత మన కవులను గౌరవించుకునేoదుకు కవిసమ్మేళనం నిర్వహించడం శుభ పరిణామమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

గురువారం జిల్లా కేంద్రం లో గుండగోని  మైసయ్య కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన లో కవులు కళాకారులది కీలకపాత్ర అని అన్నారు. లక్షల పుస్తకాలు చదివినా రాని జ్ఞానం ఒక పాట ద్వారా మాత్రమే వస్తుందని దానికి ఉదాహరణగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేశారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అందెశ్రీ రాసిన జై తెలంగాణ అనే పాట నుండి ఎందరో కవులు గోరటి వెంకన్న, గద్దర్, రసమయి లాంటివారు పాటలు రాసి ప్రజలను తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా కృషి చేశారు. దేశ పాలకుల ను ఒప్పించి రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో  తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు. తెలంగాణ 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహించాలని కెసిఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి  ఆదేశానుసారం ఈరోజు మనం కవి సమ్మేళనం నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్,90 వేల పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లతో తెలంగాణ అభివృద్ధి దశలో పయనిస్తుందని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి  చాలా చరిత్ర  ఉందని  1969 తొలి దశ ఉద్యమం నుండి  2014 వరకు కీలక  మలుపులు  తిరిగి చివరికి తెలంగాణ రాష్ట్రము సాదించుకున్నారని ఆయన తెలిపారు.తెలంగాణ చరిత్ర తెలుసుకోవడానికి తొలి, మలిదశకు  సంబందించిన  పుస్తకాలు చదవాలని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు కీలక భూమిక పోషించారని ఆయన అన్నారు.మన సాహిత్యం,చరిత్రను పుస్తకాల ద్వారా విద్యార్థులు తెలుసు కోవాలని అన్నారు
 కవి సమ్మేళనం లో తెలంగాణ స్ఫూర్తి అన్ అంశం పై 25 మంది కవులు తమ కవితలు వినిపించారు.బాలు మాస్టర్ ఆధ్వర్యంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు,తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు ఆహుతులను అలరించాయి.
అనంతరం 25 మంది కవులకు 2 వేల రూపాయల చొప్పున నగదు పురస్కారం, శాలువా, మెమొంటోలతో  ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు.
 ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు వి చంద్రశేఖర్, రాహుల్ శర్మ, డి.అర్. ఓ జగదీశ్వర్ రెడ్డి, డి పి ఆర్ వో.పి. శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, కవులు కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అలరించిన కవి సమ్మేళనం*
# కవి సమ్మేళనం ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత మన కవులను గౌరవించుకునేoదుకు కవిసమ్మేళనం నిర్వహించడం శుభ పరిణామమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Share This Post