తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెలు

ప్రచురణార్థం

తొర్రూర్ మహబూబాబాద్-2 అక్టోబర్2021.

తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెనని::  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర రావు

బతుకమ్మ పండుగ పురస్కరించుకుని ప్రతి ఇంటి ఆడపడచుకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరె అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.

శనివారం సాయంత్రం పెద్దవంగర మండల కేంద్రo లో బతుకమ్మ చీరేల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌ పండుగ‌లను నిర్వ‌హిస్తున్న‌దని అన్నారు. రూ. 333.14 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లె, ఆడపడుచులకు వారి ఆత్మగౌరవానికి ప్రతీక గా చీరెలు పంపిణీ చేస్తున్నామన్నారు..
ఏడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని, 2సంవత్సరాలుగా కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, అయినప్పటికీ ,ఎంతో ఇబ్బoది పడ్డామని, నియోజకవర్గ ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా,50 లక్షల ఆనందయ్య కరోనా మందు ను ఉచితంగా పంపిణీ చేసినట్లు, అంబులెన్స్ ను స్వయంగా అందజేయ్యడం జరిగిందన్నారు.

పేదల పక్షపాతి మన ముఖ్యమంత్రి అని, కష్టకాలంలో పేదలకు ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు ఇచ్చారని తెలిపారు. వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు నిండిన వారికి క్రొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇండ్లు కట్టి ఇచ్చే పథకం ప్రారంభిస్తామని తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలు, తండాలు బాగుచేసుకున్నామని, ట్రాక్టర్లు, ట్యాంకర్లు సమకూర్చుకున్నామని, పల్లెలు పరిశుభ్రంగా మారాయని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ ఇంటింటికి ఇస్తున్నట్లు, వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు.

పల్లెల్లో చెరువులు నిండుకుండలా పొంగిపొర్లుతున్నాయి అని వ్యవసాయ రంగంలో దేశంలోనే 6-59 వృద్ధి రేటుతో 2స్థానంలో రాష్ట్రం ఉందని ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా 1 లక్ష, 95 వేల మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలను ప్రణాళికాబద్ధంగా వారికి అందజేయనున్నట్ట్లు కలెక్టర్ తెలిపారు.

ముందస్తు ప్రణాళికలతో రుణాలను సద్వినియోగం చేసుకొని చైతన్యం కావాలని , తొర్రూర్ ఏపీ జి వి బి బ్యాంక్ లింకేజీ తో మండలంలోని 20 సంఘాలకు1 కోటి రూపాయల చెక్కును జిల్లా గ్రామీణ అభివృద్ధి సంబంధిత సంఘాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పిసీఈవో రమాదేవి, డి ఆర్ డి ఓ పీడీ సన్యాసయ్యా, డి పి ఓ రఘువరన్, ఆర్డీవో రమేష్ ఎంపీపీ రాజేశ్వరి, వైస్ ఎంపీపీ కల్పన, జెడ్పిటిసి జ్యోతిర్మయి తాసిల్దార్ సరితరాణి, ఎంపీడీవో శేషాద్రి, డీసీసీబీ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, లక్ష్మి, శర్మ సీనియర్ నాయకులు, అధికారులు ప్రజా ప్రతినిధులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
————————————-
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ గారిచే జారీ చేయడమైనది*

Share This Post