తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

తెలంగాణ ఆడుపదుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీర అందిస్తుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి జిల్లాలోని పలు వార్డులలో లబ్టిదారులకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో దసరా పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటారని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సుమారు 2 లక్షల 50 వేల చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, మంచిర్యాల మున్సిపాలీటి పరిధిలో 25 వేల మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందించడం జరుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు వరంగా భావిస్తున్నారని, వివిధ డిజైన్లు, రకరకాల రంగులతో నాణ్యత కలిగిన చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న చీరలు ధరించి బతుకమ్మ పండగ జరుపుకోవాలని, సద్దుల బతుకమ్మ పండగను తెలంగాణ ఆడ పడుచులు ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశ్యంతో చీరల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post