తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి

తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా లో  ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో.. ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.  సోమవారం 9వ రోజు, ఆఖరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ను ఆరాధిస్తారు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో ‘ సద్దుల బతుకమ్మ’ పండుగను జరుపుకుంటారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా ‘గౌరమ్మ’ను పసుపుతో తయారు చేస్తారు. ఆ గౌరమ్మను పూజించిన తర్వాత.. ఆ పసుపును తీసి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు. అమ్మవారికి ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

ప్రతి రోజు లాగానే ఈ రోజు కూడా సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల మహిళలంతా చేరి ఐక్యతతో ప్రేమను కలపి చుట్టు నిలబడి పాటలు పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. ఇక చీకటి పడుతుంది అనగా.. ఆడపడుచులు ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న చెరువుకు ఊరేగింపుగా బయలుదేరుతారు. అక్కడ మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. సంస్కృతిక శాఖ అద్వర్యం లో రవిశంకర్ బృందం ఆడి పాడి ఉత్సాహపరచడం జరిగింది.

 

 

ఈ కార్యక్రమం లో తహసీల్దార్ దానయ్య,    మున్సిపల్ కమిషనర్ సునీత

Share This Post