తెలంగాణ ఆత్మ గౌరవనికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మఅని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.

ఆదివారం నాడు వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా హంటర్ రోడ్డు , శాయంపేట లోగల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఛీప్ విప్ వినయ్ భాస్కర్ , మేయర్ గుండు సుధారాణి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పొరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.ఆనాటి పెత్తందారీ వ్యవస్థ పై తిరుగుబాటు చేసినదని, పేదవారిపై జరిగిన అన్యాయాలను న్యాయ పరంగా, చట్ట పరంగా పోరాటం జరిపిన వీర నారి అని, సాధారణ కుటుంబం లో పుట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహోన్నత మహిళా అని ఆయన అన్నారు.

ఆమె జయంతి, వర్థంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటం ఉందని, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప సందేశమన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను, తెలంగాణ పోరాట యోధులను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో
ఈ ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని వివరించారు. కుల వృత్తుల లో జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఛీప్ విప్ మాట్లాడుతూ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రజకులు, నాయీబ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబన, జీవన ప్రమాణాల పెంపుకోసం ప్రతిపాదించిన దోబీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు వెల్లడించారు. రజకులు కు హైటెక్ లాండ్రీ నిర్మిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్య‌స‌భ స‌భ్యులు బండా ప్ర‌కాష్‌, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్,జిల్లాల క‌లెక్ట‌ర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, బి.గోపి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావీణ్య‌, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, కూడా అడ్వైజర్ శివకుమార్, రజక సంఘం చైర్మన్ మధు చందర్, సభ్యులు అంకన్న, కార్పొరేటర్ రాజు, జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share This Post